కేసీఆర్ కు ధీటైన నేతను నిలబెట్టేందుకు బీజేపీ వ్యూహ్మాకంగా అడుగులు వేస్తోంది. గులాబి ముళ్ళును ముళ్ళుతోనే తప్పించాలని ఆనాడే ఈటలను కమలం పువ్వు ఆకర్షించి క్యాప్చర్ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ లో జరగనున్న సాధరణ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ పోటీ చేయనున్న గజ్వేల్ నుంచి ఈటను బరి ఉంచేందుకు వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు.
శనివారం స్టేట్ పార్టీ కార్యాలయం ఎమ్మెల్యే అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించనున్నది బీజేపీ.తొలి జాబితాలో 50 మంది అభ్యర్ధులను ప్రకటించేందకు రంగం సిద్ధం చేసింది. దీంతో నియోజకవర్గాలలో టికెట్ పై ఆశాపెట్టుకున్న ఆశావాహులు ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. అలానే కేసీఆర్ కు సరైన ప్రత్యర్ధి ఈటల అని భావించి గజ్వేల నుంచి ఆయనను బరిలోకి దించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
ఈ సారి బరిలో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. కరీంనగర్ నుంచి ఎంపీ బండి సంజయ్, కోరుట్ల నుంచి నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్, బోథ్ నుంచి అదిలాబాద్ ఎంపీ బాబురావులు అసెంబ్లీ బరిలో ఉన్నారు. పార్టీ చీఫ్ కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ లను ఎన్నికలకు సంబంధించిన కీలక బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం.