ప్రకాశం జిల్లా భూదందాలు పెచ్చురిల్లుతోంది. ఇది ప్రకాశం జిల్లాకే పరిమితం కాకుండా యావత్తు వైసీపీ మెడకు చుట్టుకునేలా ఉంది. ప్రకాశం జిల్లాలోని విలువైన భూములను అప్పనంగా కాజేసేందుకు కన్నెశారు వైసీపీ జిల్లా నేత. ఈ భూదందాలో ఆ పార్టీ బడా నేతల ఉన్నట్లు బహిరంగంగా చెప్పుకుంటున్నారు.
అధికారం ఉంది కదా..అని అడిగేవారెవ్వరంటూ.. విలువైన భూములపై వైసీపీ బడా నేతల కన్నుపండింది. ఇంకేముంది నకిలీ ధృవ పత్రాలను సృష్టించడం వెన్నతో పెట్టిన విద్య మాదిరిగా నైపుణ్యాన్ని బయటకు తీశారు. గుంటూరు, చిలకలూరిపేట, ఇతర ప్రాంతాల నుంచి 100, 50, 20 స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశారు. అధికారుల పేర్లతో తమకు కావాల్సిన ముద్రలు, రౌండ్ సీల్స్ ను మక్కికీ మక్కి ఉండేలా తయారు చేసుకున్నారు. పాత బాండ్ పత్రాలు.., నకిలీ వీలునామాలు, పాత తేదీలతో ఒప్పంద పత్రాలు రూపొందించి వేల కోట్లు విలువ చేసే భూములు అప్పనంగా కొట్టేశారు. దీనిపై నమోదైన కేసుల్లో పోలీసులు లోతైన దర్యాప్తును ప్రారంభించారు. దీంతో ఒంగోలు వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది.
ఒంగోలు శివారు ప్రాంతాల్లోని విలువైన భూములను అక్రమార్గంలో కొట్టేయాలని వైసీపీ నేతలు చేసిన దందా తాడేపల్లి ప్యాలెస్ కదిలిపోతోంది. భూ యజమానుల మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి జీపీఏ పొందడం, పాత తేదీలతో ఒప్పందాలు తయారు చేసి ఆ భూములను వివాదాల్లోకి లాగడం వంటివి చకచక జరిపోతాయి అక్కడ. యాజమానులను బెదింరించి కోట్లును దండుకున్నారని నివ్వెరబోయే వాస్తవాలు పోలీసు దర్యాప్తు తేలింది.
అయితే ఈ భూదందాలో ఉన్న వైసీపీ నేతలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి బ్యాచ్ అని ప్రచారంలోకి వచ్చింది. అయితే దాన్ని బాలినేని ఖండించి..పోలీసు విచారణకు ఆదేశించారు. కానీ.. నేటికి అసలైన భూ కుంభకోణానికి పాల్పడిన వ్యక్తులను అరెస్ట్ చేయడం లేదని నేడు బాలినేని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇది ఒక అసాధారణ భూ కుంభ కోణంగా రియల్ ఎస్టేట్ వ్యక్తులు పరిగణిస్తున్నారు. వీటి విలువ దాదాపు 4 వేల కోట్ల మేర ఉంటుందని ప్రాధమిక దర్యాప్తులో తేల్చినట్లు సమాచారం.
ఒంగోలు, ముక్తినూతలపాడు, మంగమూరు రోడ్డు,మామిడిపాలెం, రాజీవ్ నగర్, కర్నూలు రోడ్డు, కొప్పోలు తదితర ప్రాంతాల్లో పొలాలు, స్థలాలు, ఇళ్లను లక్ష్యంగా చేసుకుని భూ కుంభకోణం చేశారని .. వేల కోట్లలో చేతులు మారాయని విచారణ తెలిసిన అంశాలు. మొత్తంగా ఈ కుంభంకోణం 19 మంది వైసీపీ ముఖ్య నేతల పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదే అంశంపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సీఎంవో కార్యాలయానికి వెళ్లి క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సీఎం జగన్ కార్యదర్శి ధనుంజయరెడ్డితో బాలినేని భేటీలో దీనిపై ఫుల్ క్లారిటీతో పాటు భూ దందాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే ఒంగోలులో పార్టీ బ్రతుకడం ప్రశ్నార్ధకమేనని హెచ్చరించినట్లు కూడా అందుతున్న సమాచారం.