రాష్టానికి ప్రదాని నరేంద్రమోదీ శని, మాజీ సియం చంద్రబాబు కేతువు ముఖ్యమంత్రి జగన్ రాహువు లాగా దాపురించి చేటు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు తులసి రెడ్డి అన్నారు. అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం బాగుపడాలంటే.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రణమా శరణమా లేదా రాజీనామానా ఏదో ఒకటి తేల్చుకోవాలన్నారు.
జగన్ మోహన్ రెడ్డికి రాయలసీమ పౌరుషం లేదని, సిగ్గులేకుండా 16 నెలలు కేంద్రానికి ఊడిగం చేశారని తులసిరెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు వ్యాపారస్తుడని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ వ్యాపారం చేస్తున్నాడే తప్ప ప్రజాసేవ చేయడంలేదని ఆయన నిందించారు.
ఇప్పటికైనా మించి పోయిందిలేదని కేంద్రంతో యుద్దమా రాజీనామానా ముఖ్యమంత్రి జగన్ తేల్చుకోవాలని తులసిరెడ్డి అన్నారు.
పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం మాట తప్పి నిధుల విడుదలకు మెలికపేచీలు పెడుతున్న నేపథ్యంలో.. తులసిరెడ్డి ఫైరయ్యారు. కేంద్రాన్ని గట్టిగా నిలదీసి అడగలేకపోతున్న జగన్మోహన రెడ్డి ప్రభుత్వ దోరణిని ఆయన తప్పుపట్టారు.











