నటసింహ నందమూరి బాలకృష్ణ , మాస్ దర్శకుడు బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న యాక్షన్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీదున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ సూపర్ హిట్స్ అయిన నేపథ్యంలో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు ఈ సారి వీరిద్దరి నుంచి హ్యాట్రిక్ హిట్ ను ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టే బోయపాటి ఈ మూవీని జనరంజకంగా తీర్చిదిద్దుతున్నాడు. ఈ క్రమంలో సినిమా కోసం మంచి కేస్టింగ్ ను కూడా సెట్ చేశాడు.
తాజా సమాచారం ప్రకారం .. ఇందులో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా నటిస్తున్నాడని, ఇంకా మరికొందరు నటులు విలన్ గా అభియిస్తారని తెలుస్తోంది. అంతేకాదు .. ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్టేట్ కూడా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అదేంటంటే.. ఈ సినిమాలో కూడా జగపతి బాబు నటిస్తున్నాడని సమాచారం. అయితే ఈ సారి ఆయన లెజెండ్ తరహాలో విలన్ గా మాత్రం నటించడం లేదట. బాలయ్య పాత్రకు రైట్ హ్యాండ్ గా నటిస్తున్నారట. ఒక రకంగా ఈ సినిమా కథను మలుపుతిప్పే ప్రధాన పాత్ర ఆయనదే అవుతుందని వినికిడి. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాను మే28న విడుదల చేయబోతున్నారు. ఈ శివరాత్రికి ఈ సినిమా కి సంబంధించిన టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా విడుదల కాబోతున్నాయట.
Must Read ;- బాలయ్య చేత మళ్ళీ తొడగొట్టించనున్న ‘ క్రాక్ ’ దర్శకుడు?











