సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇటీవలే హైద్రాబాద్ షెడ్యూల్ ముగించుకొని కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంది. సరిగ్గా నెల రోజుల క్రితం దుబాయ్ లో ఓ లాంగ్ షెడ్యూల్ ను జరుపుకోగా.. అక్కడ ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ , కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. అలాగే అదే షెడ్యూల్ లో హీరోయిన్ కీర్తి సురేష్ కు సంబంధించిన కొన్ని సీన్స్ ను కూడా తీశారు.
తాజా సమాచారం ప్రకారం.. ‘సర్కారువారి పాట’ సినిమా తదుపరి షెడ్యూల్ ను కూడా దుబాయ్ లోనే చిత్రీకరించబోతున్నారట. నిజానికి ఈ షెడ్యూల్ ను యూ.యస్ లో ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల.. ఆ షెడ్యూల్ ను దుబాయ్ కి షిఫ్ట్ చేస్తున్నారట. దీని తర్వాత షెడ్యూల్ ను హైద్రాబాద్ లోనూ, గోవాలోనూ ప్లాన్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న సర్కారు వారి పాట సినిమా మహేశ్ కు ఏ రేంజ్ ఇమేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- ‘సర్కారు వారి పాట’ అవ్వగానే.. అనిల్ రావిపూడి సినిమానే?











