‘ క్రాక్ ’ సినిమాతో ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. ఆ సినిమాతో హిట్స్ లేని రవితేజ ను మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించిన ఘనత దక్కించుకున్నాడు. ఆ మూవీ తెచ్చిపెట్టిన అద్భుత విజయంతో వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్నాడు గోపీచంద్. ఈ నేపథ్యంలో నటసింహ నందమూరి బాలకృష్ణ కు ఒక అదిరిపోయే స్టోరీ చెప్పాడట. బాలయ్య ఆ కథకి బాగా ఇంప్రెస్ అయ్యారట. బోయపాటి సినిమా తర్వాత ఆయన చేయబోయే సినిమా ఇదే కానుందని అంటున్నారు. ఈ మూవీతో బాలయ్య ను మళ్ళీ ఫ్యాక్షన్ బాటలో నడిపించబోతున్నాడట గోపీచంద్ మలినేని.
బిఫోర్ లాస్టియర్ ‘యన్టీఆర్’ సిరీస్, ‘రూలర్’ మూవీస్ తో వరుజ పరాజయాలు అందుకున్న బాలకృష్ణ.. మే 28న విడుదల కాబోతున్న బోయపాటి శ్రీను సినిమా మీద మంచి హోప్స్ పెట్టుకున్నారు. ఆ సినిమాతో బాలయ్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని నమ్మకంగా ఉన్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో బాలయ్య.. ఆ సక్సెస్ ను సస్టెయిన్ చేయడానికి వెంటనే క్రాక్ దర్శకుడు గోపీచంద్ సినిమా మొదలు పెట్టే ఉద్దేశంతో ఉన్నారట. బాలయ్య కెరీర్ కు బంగారు బాట వేసినవి ఫ్యాక్షన్ మూవీస్ అన్న సంగతి తెలిసిందే. ఆ బ్యాక్ డ్రాప్ లో ఇప్పటి వరకూ వచ్చిన బాలయ్య పలు చిత్రాలు అద్భుత విజయాలు సొంతం చేసుకున్నాయి. అందుకే ఆయన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ కథాంశంతో .. మళ్ళీ రాయలసీమ నేపథ్యంలో ఓ పవర్ ఫుల్ స్టోరీ రాసుకున్నాడట దర్శకుడు గోపీచంద్ మలినేని. మరి ఈ సినిమాతో బాలయ్య మళ్ళీ ఏ రేంజ్ లో తొడగొడతారో చూడాలి.
Must Read ;- యాక్షన్.. ఎమోషన్స్ నేపథ్యంలో బాలయ్య చిత్రం