అనంతపురంలో జేసి బ్రదర్స్ దీక్ష పిలుపుతో హైటెన్షన్ నెలకొన్న సంగతి తెలిసిందే. పోలీసుల అనమతి లేకపోయినా, అరెస్ట్ చేసినా ప్రశాంతంగా మా నిరసన మేము తెలుపుతాం అని జేసీ బ్రదర్స్ ప్రకటించారు. జేసీ బ్రదర్స్ ఇంటి నుండి రాకుండా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. అంతేకాదు.. టీడీపీ శ్రేణులు దీక్షలో పాల్గొనకుండా.. వారి మద్దతు జేసీ బ్రదర్స్‌కి అందకుండా ఉండడానికి పోలీసులను భారీ సంఖ్యలో మోహరించారు.
ఫామ్ హౌస్‌లో ఉన్న జేసీ దివాకర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు దివాకర్ రెడ్డి. తన ఇంట్లోకి వచ్చే హక్కు మీకెవరూ ఇచ్చారంటూ పోలీసులను నిలదీశారు. పోలీసులు నిర్లక్ష్యంగా.. దురుసుగా ప్రవర్తించడంతో.. దివాకర్ రెడ్డి తీవ్ర గొంతుకతో పోలీసులను ప్రశ్నించాడు. ఆయనలా ప్రశ్నిస్తుంటే తట్టుకోలేని డిఎస్పీ.. తన సాటి పోలీస్ పై చిందులు వేయడం మొదలుపెట్టాడు. అక్కడి పోలీసులు, టీడీపీ శ్రేణులు, స్థానికులు సర్దుబాటు చేశారు.
Also Read: విశాఖ టీడీపీ నేతలకు రెవెన్యూ అధికారుల షాక్.. భూముల స్వాధీనం











