బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సరికొత్త నైపుణ్యంతో 2021వ సంవత్సరంలోకి అడుగుపెట్టాడు. తాను డ్రోన్ సెల్ఫీ పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నట్లు హృతిక్ స్వయంగా తెలిపాడు. తనకు సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ‘బ్యాక్ ఆన్ సెట్’ అని పోస్ట్ చేశాడు. అంతేకాకుండా హృతిక్ డ్రోన్ సెల్ఫీ పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నానని అలాగే అభిమానులు కూడా కొత్త ఏడాది సందర్భంగా ఏదొక నైపుణ్యాన్ని ఎంచుకోవాలని కోరారు. డ్రోన్ సెల్ఫీకి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు హృతిక్.
ఆ వీడియోలో హృతిక్, కునాల్ కపూర్‌తో కలిసి డ్రోన్ సెల్ఫీ తీసుకున్నాడు. అందులో వారిద్దరూ గడ్డిపై పడుకొని సెల్ఫీ తీసుకున్నట్లు వీడియోలో కనిపించింది. హృతిక్ డ్రోన్ రిమోట్ ను చేతులో పట్టుకొని ఆపరేట్ చేస్తున్నట్లు కూడా కనిపించింది. వీడియోతో పాటు సందేశాన్ని షేర్ చేశాడు హృతిక్. ‘ఒక సరికొత్త నైపుణ్యంతో 2021వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను’ అని రాసుకొచ్చాడు. హృతిక్ తీసిన డ్రోన్ సెల్ఫీలను చూసిన సుజాన్ ఖాన్ ఆయనను పొగిడింది. ఆమెతో పాటు అభిమానులు కూడా హృతిక్ ను అభినందిస్తున్నారు. తమ అభిమాన హీరో లా తాము కూడా ఏదొక కొత్త నైపుణ్యాన్ని ఎన్నుకుంటామని అంటున్నారు. ప్రస్తుతం హృతిక్ ఏ షూటింగ్ లో పాల్గొంటున్నాడో స్పష్టత మాత్రం రాలేదనే చెప్పాలి.
అయితే కొంత మంది అభిమానులు ఆయన ఒక యాడ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడని అంటున్నారు. అలాగే హృతిక్ త్వరలోనే ఒక వెబ్ సిరీస్ లో నటించనున్నాడని తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో కూడుకున్న వెబ్ సిరీస్ అని, ఇందుకోసం హృతిక్ భారీగా పారితోషకం అందుకుంటున్నాడని సమాచారం. ఏదిఏమైనా 2021వ సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించినందుకు ఖచ్చితంగా హృతిక్ కు అభినందనలు తెలపాలి.
Entering 2021 with new skills#Droneselfies pic.twitter.com/y9zzHnTQyT
— Hrithik Roshan (@iHrithik) January 3, 2021