ప్రతి పక్షాలు నిరసన కార్యక్రమాలను ఆపడానికి అధికార పక్షం సాధారణంగా హౌస్ అరెస్ట్‌లు చేయడాలు, నిలువరించడాలు ఇంకా ఎక్కువ ఆందోళన జరిగితే అరెస్ట్ చేసి తిరిగి బెయిల్ పైన విడుదల చేయడాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏపీలోని అధికార పక్షం కొత్త సంప్రదాయానికి తెరతీసింది.
నిరసన తెలిపినా.. చివరికి అధికార పక్షం దాడిని ఎదుర్కొని నిలబడ్డా సరే అట్రాసిటి కేసులు పెట్టడం పాటిపాటైపోయింది. మొన్నటికి మొన్న తాడిపత్రిలో దాడి చేసింది అధికార పక్షమైతే.. కేసులు పెట్టింది ప్రతి పక్షం పైన. అదే తరహాలో చలో పులివెందుల కార్యక్రమంలో కూడా అమలు చేస్తున్నారు అధికార పక్షం. చలో పులివెందుల కార్యక్రమం అడ్డుకోవడానికి పోలీసులు పలువురు టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలోనే బీటెక్ రవిని చెన్నైలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది.
Also Read: వేడెక్కిన తాడిపత్రి : జేసీ ఇంటిపై కేతిరెడ్డి దాడి!