ఉమ్మడి కార్యాచరణతోనే పీఆర్సీ సాధ్యం!
గౌరప్రదమైన పీఆర్సీ సాధనకు ఏపి ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కటాటిపైకి వచ్చారు. ఉమ్మడి ఐక్యకార్యచరణతోనే జగన్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మరోవైపు వరస సమావేశాలతో ఉద్యోగులు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారు. సమ్మె నోటీసు ఇచ్చేందుకు ఉద్యోగ సంఘాలు సమయక్తం అవుతున్న వేళ.. ఏపీలోని ఉద్యోగ సంఘాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. ఉమ్మడి కార్యాచరణతో ముందుకు పోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో శుక్రవారం ఉదయం ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం అయ్యేందుకు షేడ్యూల్ ఖరారు చేసుకోగా, ఉన్నతాధికారులు సమావేశానికి అనుమతి ఇవ్వలేదు.
సమ్మె నోటీస్ ఇచ్చి తీరుతాం..!
ప్రభుత్వం ఎన్ని ఆంక్షాలు విధించినా.. పీఆర్సీని సాధించుకుని తీరుతామని ఉద్యోగులు భీష్మించాయి. ఈ రోజు ఎట్టి పరిస్థితిలోనైనా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మకు సమ్మె నోటీసు ఇచ్చి తీరుతామని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు చెప్పారు. నోటీసు ఇచ్చిన అనంతరం కార్యచరణ సిద్ధం చేసుకుంటున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వం పీఆర్సీ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. జీతాల బిల్లులను ప్రాసెస్ చేసేది లేదని తమ ఉద్యోగులు స్పష్టం చేశారని ఆయన చెప్పుకోచ్చారు. ఉద్యోగ సంఘ నేతల సమావేశానికి అనుమతి నిరాకరించడంతో ఎన్జీవో హోంలో ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, బండి శ్రీనివాసరావు, బొప్పరాజు, సూర్యనారాయణ భేటీ అయ్యారు.