పదవీ విరమణ వయస్సు పెంపుకు ఆమోదం..!
ఏపీ మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం తీసుకున్న అనేక అంశాలపై చర్చించి, మంత్రులు ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్ల పెంపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. అలానే కరోనా పరిస్థితులు, నియంత్రణపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల ఉద్యోగుల పీఆర్సీ పై తీసుకొచ్చిన జీవోలకు ఆమోదించారు. కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ నియామకాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలపై ఆమోదం, ఉద్యోగుల ఇళ్ల పథకానికి మంత్రి వర్గం ఆమోద ముద్ర లభించగా.. జగనన్న టౌన్ షిప్ లలో 10 శాతం ప్లాట్స్ ప్రభుత్వం ఉద్యోగులకు కేటాయింపు, 20 శాతం రిబేట్, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపు, ఈబీసీ నేస్తం అమలు, వారానికి నాలుగు సర్వీసులు నడిపేలా ఇండిగో ఎయిర్ లైన్స్ తో ఒప్పందం వంటి వాటికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలానే రాష్ట్రం ప్రభుత్వ సహకారంతో ఏడాదిపాటు అమలులో ఒప్పందం, ఆ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా కూడా మంత్రివర్గ ఆమోద ముద్ర లభించింది.
ఉద్యోగ సమస్యల ఊసే ఎత్తని కేబినేట్..!
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కొరకు ప్రకటించిన పీఆర్సీనే ఫైనల్ అన్నట్లు కనిపిస్తోంది. 23శాత ఫిట్మెంట్ ను నిర్ణయిస్తూ ప్రభుత్వ ఇటీవల జారీచేసిన జీవోలను మంత్రివర్గం ఆమోదించింది. గడిచిన వారంరోజులుగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా.. పాత పీఆర్సీ జీవోలకే ఆమోదం తెలిపింది మంత్రి వర్గం. దీనిబట్టి ఉద్యోగులకు పీఆర్సీ పెంచే ప్రసక్తే లేదు అన్నది జగన్ రెడ్డి ప్రభుత్వ వాదన. ఉద్యమాలు, సహాయ నిరాకరణలు వంటివి ఎన్ని చేసిన తన పని తాను చేసుకుంటూ పోవడమే అన్నట్లు ఉద్యోగులు పట్ల మొండిగా వ్యవహరిస్తున్నారు జగన్ రెడ్డి. మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఐఆర్ కన్నా అధిక పీఆర్సీ ఇవ్వాల్సిందేనని ఇప్పటికే ఉద్యమ బాట పట్టిన విషయం తెలిసిందే!