కొమ్మపై కోపంతో చెట్టును నరికేస్తే ఎలా?
కొమ్మపై కోపం నీడనిచ్చే చెట్టును నరికేసుకున్నట్లు .. సినీ పరిశ్రమపై ఉన్న కోపం రాష్ట్ర ప్రజలకు వినోదాన్ని పంచే థియేటర్లపై చూపితే ఎలా అని రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లవెత్తున్నాయి. రాజకీయ అవినీతిని కప్పిపెట్టి .. సినీ హీరోలా రెమ్యునరేషన్ గురించి మాట్లాడే.. దౌర్భాగ్య పాలకులు ఏపీకి దొరకడం దారుణమని సినీ వర్గ ప్రముఖులు విమర్శిస్తున్నారు. జీవో నెంబర్ 35 ను వ్యతిరేకించినందుకే కక్ష్యకట్టి సినీ పరిశ్రమపై జగన్ ప్రభుత్వం కత్తికట్టిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పండుల సమయంలో భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్ డేట్ ప్రకటించాయి. మరోపక్క ఏపీలో థియేటర్లపై వరుస దాడులు చేస్తూ.. అంక్షలు విధిస్తున్నారు. టికెట్లను అధిక ధరకు అమ్మితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో థియేటర్ల వ్యయం భారమై.. రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను ఒక్కొక్కటిగా స్వచ్ఛందంగా మూసివేస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 200 థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేత..!
జగన్ రెడ్డి చర్యలు కారణంగా రాష్ట్ర వ్యాపంగా 1000 సినిమా థియేటర్ల భవిష్యత్తు అంధకారంలో పడింది. వీటిపై ఆధారపడి జీవనం సాగించే కుటుంబాలు రోడ్డుపడ్డాయి. సినిమా థియేటర్లపై జగన్ రెడ్డి ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు, షరతులు ఒత్తుళ్లకు తలగొద్దిలేదని థియేటర్ల యాజమాన్యాలు నిర్ణయించుకున్నాయి. నిర్వహణ వ్యయం ఎక్కవవుతోందని భావించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 200 థియేటర్ల కు పైగా స్వచ్ఛందంగా మూసివేశాయి. మరోవైపు పదుల సంఖ్యలో థియేటర్లను నిబంధనల నేపంతో ప్రభుత్వమే సీజ్ చేసింది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల ఉనికి నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకోవైపు థియేటర్లు మూసివేయాల్సి వచ్చిన మూసివేస్తామే తప్పా .. ప్రభుత్వం నిబంధనకు అనుగుణంగా టికెట్ ధరలను రూ. 5,10 కి అమ్మబోమని తెగసి చెబుతున్నారు. ఇలా సినీ పరిశ్రమకు, జగన్ రెడ్డికి మధ్య తలెత్తిన గ్యాప్ .. చిలికి చిలికి గాలి వానలా మారింది. చివరికి థియేటర్ల యాజమాన్యం రోడ్డుపడ్డారు. సగటు ప్రేక్షకుడు ప్రశాంతంగా పండుగ సమయాల్లో అభిమాన హీరో సినిమా చూడలేని పరిస్థితి దాపురించింది!











