ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా రాలేదు. కానీ ఆమె మాత్రం హోం క్వారంటైన్ కు పరిమితం కానున్నారు. ఇదంతా ముందు జాగ్రత్త చర్యగానే ఆమె కు సంబంధించిన వర్గాలు పేర్కొంటున్నాయి.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్ లో ఉండనున్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కవిత విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఆమెను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావడంతో, కవిత ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఐదు రోజులు పార్టీ శ్రేణులకు, ప్రజలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుబాటులో ఉండటం లేదు.
టెస్టులు చేయించారా?
ఎమ్మెల్సీగా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్న కల్వకుంట్ల కవితకు కొవిడ్ టెస్టులు చేయించారో లేదో మాత్రం వెల్లడి కాలేదు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన నేపథ్యంలో అనివార్యంగా ఆమె జనసమూహంలో మెలిగారు. దాంతో పాటు ఆమెను కలిసిన ఎమ్మెల్యేకు కూడా కరోనా పాజిటివ్ తేలింది. తన సంగతి నిర్ధరణ అయ్యే వరకు, తన వలన మరొకరికి సోకకుండా ఉండేందుకు కల్వకుంట్ల కవిత ముందుజాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.