టాలీవుడ్ లో హైఓల్టేజ్ యాక్షన్ మూవీస్ తీయడంలో చెయితిరిగిన దర్శకుడు బోయపాటి శీను. హీరోల్ని పవర్ ఫుల్ గా ఎలివేట్ చేయడంలో ఆయన దిట్ట. ప్రస్తుతం బోయపాటి.. బాలయ్య హీరోగా ‘అఖండ’ అనే మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. సింహ, లెజెండ్ తర్వాత వస్తోన్న ఈ మూడో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. దీనికితోడు ఇటీవల విడుదలైన టీజర్ .. అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసేసింది. మే 28న సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత బోయపాటి ఏ హీరోతో చేస్తాడు? ఎలాంటి సినిమా చేస్తాడు అనేది అందరికీ ఆత్రుతగా మారింది.
బాలయ్య సినిమా తర్వాత బోయపాటి రవితేజ తో చేస్తాడని, అల్లు అర్జున్ తో చేస్తాడని , యన్టీఆర్ తో చేస్తాడని.. ఇంకా చిరంజీవితో కూడా ఓ సినిమా చేయబోతున్నాడని ఇప్పటి వరకూ రకరకాల వార్తలు వినిపించాయి. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. దీని తర్వాత బోయపాటి కళ్యాణ్ రామ్ తో ఓ సినిమా చేయబోతున్నాడని .. ఇది పైనల్ అని తెలుస్తోంది. పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ కు.. మళ్ళీ ఆ స్థాయిలో మరో సినిమా పడనేలేదు. ఈ సారి ఆ బాధ్యతను బోయపాటి తీసుకున్నాడని .. కళ్యాణ్ రామ్ తో బోయపాటి ఓ అదిరిపోయే యాక్షన్ సినిమా తీయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
బోయపాటి , కళ్యాణ్ రామ్ కాంబినేషన్ వెనుక యన్టీఆర్ హ్యాండ్ ఉందని టాక్. ఎందుకంటే.. తన అన్న సొంత బ్యానర్ యన్టీఆర్ ఆర్ట్స్ .. లో ఎప్పుడు సినిమా తీసినా.. తన వంతు సాయం తప్పకుండా చేస్తాడు. అలాగే.. ఆ సినిమా ప్రమోషన్స్ లో కూడా ఏదో రూపంలో హెల్ప్ చేస్తాడు. అందుకే ఈసారి అన్న కెరీర్ లో ఓ మంచి హిట్ పడాలని ఆ దిశగా కృషి చేస్తున్నాడని , అందులో భాగంగానే.. బోయపాటి దర్శకత్వంలో సినిమాను సెట్ చేశాడని అంటున్నారు. మరి బోయపాటి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ కు ఏ రేంజ్ సినిమా పడుతుందో చూడాలి.
Must Read ;- అఆ.. అఖండ వర్సెస్ ఆచార్య











