నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘సింహ, లెజెండ్’ బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు .. ఉగాది రోజున విడుదలైన ‘అఖండ’ టైటిల్ అండ్ టీజర్ కు బ్రహ్మాండమైన రెస్సాన్స్ వచ్చింది. దీంతో బాలయ్య , గోపిచంద్ మలినేని కాంబో మూవీపై కూడా ఓ రేంజ్ లో క్రేజ్ ఏర్పడింది.
ఇటీవల రవితేజ ‘క్రాక్’ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించిన గోపీచంద్.. బాలకృష్ణ కోసం ఇప్పుడు ఏ తరహా కథను ఎంపిక చేస్తున్నాడు? బాలయ్యను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నాడు అనే అంశాల్లో అభిమానుల్లో క్యూరియాసిటీ మొదలైంది. దీనికి తగ్గట్టుగానే బాలకృష్ణతో గోపీచంద్ ఓ అదిరిపోయే కథాంశాన్ని ఎంపిక చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. క్రాక్ సినిమా తరహాలోనే దీన్ని కూడా యదార్ధ సంఘటనల ఆధారంగా రూపొందించబోతున్నట్టు సమాచారం.
‘క్రాక్’ మూవీ కోసం ఒంగోలు రౌడీ షీటర్ కటారి కృష్ణ .. క్రైమ్ హిస్టరీని సినిమాకి చాలా బ్రిలియంట్ గా కనెక్ట్ చేసిన గోపీచంద్ .. ఈ సారి వేటపాలెం బ్యాక్ డ్రాప్ లో మరో క్రైమ్ స్టోరీని బాలయ్య కోసం రీసెర్చ్ చేస్తున్నాడట. ఇటీవల వేటపాలెం గ్రామంలోని చాలా పాత గ్రంధాలయంలో గోపీచంద్ కొన్ని పాత పేపర్స్ ను తిరగేస్తున్న ఫోటోల్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. దీంతో బాలయ్య తో చేయబోతున్న సినిమా కథ కోసం కొన్ని యదార్ధ సంఘటనల్ని వెలికితీస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే క్రాక్ లో రవితేజ లా బాలకృష్ణని కూడా పోలీస్ పాత్రలో చూపిస్తున్నాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఏది ఏమైనా .. బాలయ్య, గోపీచంద్ కాంబో మూవీకి ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. మరి గోపీచంద్ నిజంగానే బాలయ్యతో యదార్ధ సంఘటనలతో సినిమా తీస్తాడో లేదో చూడాలి.
Glad to visit ..One of the oldest n big library in #vetapalem ..Saraswata_Niketanam ..felt like visiting a temple #knowledgeispower pic.twitter.com/gKNdmfKjOD
— Gopichandh Malineni (@megopichand) April 10, 2021