టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చేయడంపై ఆయన ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ అరాచకపాలనలో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాక్షసత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆత్మకూరు గ్రామస్తులకు ఎలాంటి న్యాయం చేయకుండానే రోడ్లు ఎలా కూల్చేశారంటూ ప్రశ్నించారు. కోర్టు ఆదేశాలను పాటించకుండా.. రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఆత్మకూరు బాధితులకు న్యాయం జరిగేవరకూ టీడీపీ అండగా ఉంటుంది’’ అని అన్నారు.
Must Read ;- అలిపిరిలో లోకేశ్ ప్రమాణం.. మరి జగన్‌రెడ్డి ఎక్కడ?
జే ట్యాక్స్ వస్తే సరి. లేదంటే జేసీబీ వస్తుంది. ఇదీ @ysjagan అరాచకపాలనలో మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి రాక్షసత్వం. ఆత్మకూరు గ్రామంలో రోడ్డు విస్తరణ కోసమంటూ బాధితులకు ప్రత్యామ్నాయం చూపకుండానే 120 ఇళ్లను కూల్చేశారు.(1/2) pic.twitter.com/ExeWdxVNag
— Lokesh Nara (@naralokesh) April 18, 2021











