మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్.. మూడేళ్ళ క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘ఆది’ అనే థ్రిల్లర్ మూవీతో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత ‘ఇరుపత్తియొన్నామ్ నూట్టాండు’ అనే మూవీతో పరాజయం ఎదుర్కొన్నాడు. ముచ్చటగా మూడో ప్రయత్నం గా ‘హృదయం’ అనే రొమాంటిక్ లవ్ స్టోరీ తో రాబోతున్నాడు. ఇందులో ప్రముఖ మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ తనయ .. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. మరో కథానాయికగా దర్శనా రాజేంద్రన్ ఎంపికైంది. దీనికి సీనియర్ మలయాళ నటుడు శ్రీనివాసన్ తనయుడు.. సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్, హీరో.. వినీత్ శ్రీనివాసన్ దర్శకుడు.
మేరీ ల్యాండ్ సినిమాస్, బిగ్ బ్యాంగ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై .. వైశాఖ్ సుబ్రహ్మణియన్, నోబుల్ బాబు థామస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు వినీత్ శ్రీనివాసన్, అతడి భార్య జీవితంలోనూ, అతడి కాలేజ్ రోజుల్లోనూ జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా హృదయం సినిమా రూపొందుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. హీరో ప్రణవ్ మోహన్ లాల్, హీరోయిన్స్ కళ్యాణి ప్రియదర్శన్, దర్శనా రాజేంద్రన్ ఒక లాన్ లో పవళించి.. రొమాంటిక్ మూడ్ లో ముచ్చటించుకుంటున్న లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈ సినిమా పోస్టర్ పై మెగాస్టార్ చిరంజీవి స్పందించడం విశేషం. తన బెస్ట్ ఫ్రెండ్ మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ హీరోరగా నటిస్తున్న ‘హృదయం’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు చిరంజీవి. లాస్టియర్ ఓనమ్ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు . అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా విడుదల వాయిదా పడింది. త్వరలోనే సినిమాను విడుదల చేయబోతున్నారు. ఇందులో మరో మలయాళ స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఒక పాట పాడడం విశేషం.
Must Read ;- అఖిల్ ‘ఏజెంట్’ కోసం మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ ?
Best wishes to @impranavlal son of my dear friend #Lalettan @Mohanlal and the entire team of @hridayamthefilm @kalyanipriyan @darshanarajend #VineethSreenivasan @merrylandcine #BigBangEntertainments #Hridayam #HridayamFirstLook pic.twitter.com/7bauHwedfW
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 18, 2021










