ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో బాలకృష్ణ, బోయపాటి సినిమా ఒకటి. యన్టీఆర్ జయంతి సందర్భంగా మే 28న సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సింహా, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో బాలయ్య, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఖాయం అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ నిర్ణయించకపోవడంతో .. అభిమానులు కాస్తంత నిరాశగా ఉన్నారు.
‘మోనార్క్, టార్చ్ బేరర్, డేంజర్, గాడ్ ఫాదర్’ లాంటి పవర్ ఫుల్ ఇంగ్లీష్ టైటిల్స్ లో ఒకటి ఖాయం చేస్తారని అందరూ అనుకుంటున్నారు. అయితే ఈ విషయంలో బోయపాటి ప్లాన్ వేరే అని తెలుస్తోంది. ఉగాది పర్వదినాన అంటే.. ఏప్రిల్ 13న టైటిల్ ను ఓ ప్రత్యేక పోస్టర్ తో ప్రకటించి.. అభిమానుల్ని సర్ ప్రైజ్ చేయాలని బోయపాటి అనుకుంటున్నాడట. అలాగే.. ఈ సినిమా టైటిల్ ను అందరూ అనుకున్న విధంగా ఇంగ్లీష్ లో కాకుండా.. సినిమా కాన్సెప్ట్ కు , బాలయ్య పాత్రకు అనుగుణంగా డివోషలన్ టచ్ తో కూడిన టైటిల్ ను ఫిక్స్ చేయాలని చూస్తున్నాడట. అంటే సంస్కృత పదంతో కూడిన టైటిల్ ను అనుకుంటున్నాడట. ఆ పదానికి అర్ధం దాదాపు అన్ని భాషల వారికీ అర్ధమవుతుందట.
ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. అందులో ఒక పాత్ర ఐఏయస్ ఆఫీసర్ అయితే.. మరోపాత్ర అఘోరా అని ముందు అనుకున్నాడు బోయపాటి. అయితే ఇప్పుడు అఘోరా పాత్రను తొలగించి.. మరో కొత్త పాత్రను క్రియేట్ చేసి.. దానికి సంబంధించిన షూటింగ్ ను కూడా కంప్లీట్ చేశారట. ఆ క్రమంలోనే బాలయ్య పాత్ర కు డివోషనల్ టచ్ ఉంటుందట. అందుకే సినిమా టైటిల్ ను సంస్కతంలో ఖాయం చేయబోతున్నారట. సో.. ఉగాది పర్వదినాన.. తెలుగు ప్రజల ముందుకు సంస్కృత టైటిల్ తో బాలయ్య అభిమానుల్ని అలరించ బోతున్నారన్నమాట. అంటే ‘జయజానకి నాయక, వినయ విధేయ రామ’ తరహా సౌండింగ్ తో టైటిల్ ఉండొచ్చని మనం ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. మరి ఆ సంస్కృత టైటిల్ ఏంటో చూడాలి.
Also Read:బాలయ్య ను ఢీ కొట్టేది ఈయనేనా?











