వరద భయం వీడక ముందే గ్రేటర్ హైదరాబాద్ ప్రజలను మరో భయం వెంటాడుతోంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ఇక్కడ వైరస్ వ్యాప్తి కలవర పెడుతూనే ఉంది. తాజాగా నగరంలో నమోదవుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో వందలాది కాలనీలు నీట మునగడంతో ప్రత్యేక రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే క్యాంపుల్లో ప్రజలను కొత్త భయం వెంటాడుతోంది. ఎవరికి కరోనా సోకిందో.. ఎవరి నుండి తమకు ఆ మహమ్మారి సోకుతుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అనేక మందికి జలుబు, దగ్గు
ఇందుకు కారణం లేక పోలేదు. వరద ముంపు ప్రాంతాల్లో గ్రేటర్ పాలక వర్గం పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టింది. ప్రత్యేక ఏర్పాట్లు చేసి నీట మునిగిన కాలనీల ప్రజలను బయటకు తీసుకు వస్తోంది. అయితే ఇప్పటికీ నగరంలో కరోనా వ్యాప్తి ఏ మాత్రం తగ్గలేదు. రోజు కేసులు బయట పడుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంతో వరద బాదిత శిబిరాల్లో అనేక మంది జలుబు, దగ్గుతో బాధపడుతుంటడంతో వైద్య పరీక్‌్లు నిర్వహిస్తున్నారు. ఇలా నిర్వహిస్తున్న పరీక్షల్లో కొంతమందికి కరోనా పాజిటీవ్ గా తేలింది. దీంతో అధికారుల్లో టెన్షన్ మొదలైంది. రిలీఫ్ క్యాంపుల్లో పూర్తిస్థాయిలో టెస్టులు నిర్వహించాలని భావిస్తోంది. ఇక లక్షణాలు ఉన్న వారు అందరికీ దూరంగా ఉండి స్థానిక అధికారులకు , వైధ్య సిబ్బందికి సమాచారం అందించాలని సూచిస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో బిజీగా ఉన్న ప్రభుత్వం కరోనా విజృంబిస్తే ఏం చేయాలన్న దానిపై కూడా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తోంది.
ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు .. మంత్రి ఈటెల రాజేందర్
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని… వరద ముంపు నుంచి కాపాడటమొక్కటే తమ ముందున్న లక్ష్యం కాదని … వారికి ఎలాంటి ఇబ్బందులు , వ్యాధులు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు మంత్రి ఈటెల రాజేందర్. ఇందుకు ప్రజలు కూడా తమతో సహకరించాలని కోరుతున్నారు. క్యాంపుల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తే ఆపడం మరింత కష్టమని.. క్యాంపుల వద్ద నియమించిన వైద్య సిబ్బంది నిరంతరం అప్‌ామత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. కరోనా ప్రారంభమైన నాటి నుండి నిర్విరామంగా వైరస్ నివరాణకు కృషి చేస్తున్న వైద్యుల సేవలను ఎప్పటికీ మరవ లేమని.. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేయాలని ప్రభుత్వం కోరుతోంది .











