టీకా సామర్థ్యం, సురక్షణ విషయాలలో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో వ్యాక్సినేషన్ మొదలైన తర్వాత కేసులు సంఖ్య ఆకాశాన్నంటిందని చెప్పచ్చు. ఒక్కరోజులో కొత్త కేసులు 4 లక్షలు దాటాయంటేనే కరోనా ఎంతలా అమెరికాలో వ్యాప్తి చెందుతుందో చెప్పాల్సిన పనిలేదు. ఇది విన్న ప్రపంచదేశాలు కూడా వ్యాక్సిన్ పట్ల పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా ప్రజల్లో భయం పోగొట్టడానికి అక్కడి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా గత శుక్రవారం ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ లైవ్‌లో టీకా తీసుకున్నారు. ఇప్పుడు బైడెన్ కూడా తన వంతుగా ప్రజల్లోని అనుమానాలను, భయాలను పొగొట్టే ప్రయత్నంలో భాగంగానే టీకా తీసుకున్నారు. దీన్ని అందరూ చూసే విధంగా కూడా ఏర్పాటు చేశారు.
ముందే మాటిచ్చారు
ప్రజల్లో భయాన్ని పోగొట్టడమే కాదు.. ఎన్నికల ప్రచారం సమయంలో టీకా తీసుకుంటానని చెప్పిన బైడెన్ మాట నిలబెట్టుకున్నారు. ఇలా ప్రముఖులంతా టీకా తీసుకోవాలని కూడా బైడెన్ తెలియజేశారు. అందువల్ల ప్రజల్లోని అనుమానాలను తొలగించడానికి సాధ్యమవుతుందని, అప్పుడే అమెరికాను కరోనా కోరల నండి కాపాడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో భయపడడానికి ఏమీ లేదు. వ్యాక్సిన్ తీసుకుని నిపుణులు చెప్పిన సూచనలు పాటిస్తే చాలని బైడెన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
వైద్యులు, మెడికల్ వర్కర్స్ సేవలను బైడెన్ కొనియాడారు. వారు చేస్తున్న సేవలు అనిర్వచనియమని, అమెరికా మాత్రమే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్లమంది ప్రాణాలను కాపాడుతున్న ఘనత వారికే దక్కుతుందని, వారు లేని క్షణం అనే పరిస్థితిని ఊహించడానికి కూడా సాధ్యం కాదని అన్నారు. అమెరికాలో కేసులు 2 కోట్లకు సమీపిస్తున్నాయి. కరోనా దాటికి ఇప్పటికే 3.3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కేసులపరంగా, మరణాల పరంగా అగ్రరాజ్యం అగ్రస్థానంలో కొనసాగుతుంది.
Must read ;-= బైడెన్, ఆర్నాబ్ కోసం తెగ గూగల్ చేశారట జనాలు