టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిక్ బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో విజయ్ .. బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ , పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ లో పూరీ, చార్మీకౌర్, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ .. మరో హిందీ సినిమాలో కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ .. ఇన్ స్టా లో విజయ్ ను ఫాలో అయింది. దాంతో నెటిజెన్స్ లో మరింత ఆసక్తి మొదలైంది. త్వరలోనే ఈ ఇద్దరి జోడీగా మొదలయ్యే సినిమా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.
ప్రస్తుతం కత్రినా కైఫ్ ‘సూర్యవంశీ, టైగర్ 3, ఫోన్ బూత్’ సినిమాల్లో నటిస్తోంది. అలాగే.. విజయ్ దేవరకొండ కూడా పలు చిత్రాలకు కమిట్ మెంట్ ఇచ్చాడు. ఇద్దరి కమిట్ మెంట్ పూర్తయ్యే టైమ్ కి సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతోందని వినికిడి. కత్రినా కైఫ్ ‘మల్లీశ్వరి, అల్లరి పిడుగు’ లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. మరి అర్జున్ రెడ్డితో ఆమె రొమాన్స్ ఏ రేంజ్ లో ఉండబోతోందో చూడాలి.