మహిళా ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో మల్లూకుట్టి కీర్తి సురేష్ సౌత్ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. ‘మహానటి’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది కీర్తి సురేష్. ప్రస్తుతం ‘మిస్ ఇండియా’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకు నరేంద్ర నాథ్ దర్శకత్వం వహిస్తుండగా మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా ‘మిస్ ఇండియా’ సినిమాపై ఒక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కానుందని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే అనేక సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని సినిమాలు మంచి విజయం అందుకుంటే మరికొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించాయి. సినిమా రిజల్ట్ ఎలా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేయడానికి దర్శకనిర్మాతలు ఉత్సాహం చూపిస్తున్నారు. అలాగే ‘మిస్ ఇండియా’ నిర్మాత కూడా ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి మొదట్నుంచి ఆలోచన చేస్తున్నారు.
ఇక ఈ చిత్రం వచ్చే నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాపై మొదటి నుండి ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. లేటెస్ట్ గా విడుదలైన మిస్ ఇండియా టీజర్ ప్రామిసింగ్ గా ఉండడంతో.. కీర్తి సురేష్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో కీర్తి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి మరి.