గతంతో పోల్చుకుంటే హీరో పాత్రలే కాదు హాస్య పాత్రలు కూడా ఆయనకు సన్నగిల్లాయి. ఎప్పుడో నలభై ఏళ్ల క్రితం వచ్చిన “సీతాకోకచిలుక” చిత్రం ద్వారా బాల నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన అలీ హాస్య పాత్రలు చేస్తూనే మధ్యలో హీరోగానూ మెరిశారు. అయితే రాను రాను హీరో పాత్రలే కాదు హాస్య పాత్రల అవకాశాలు తగ్గిపోయాయి . ఈ నేపథ్యంలోనే ఆ మధ్య అలీవుడ్ ఎంటర్ టైన్మెంట్స్ పేరుతో సొంతగా ఓ సంస్థను నెలకొల్పి, దానిపై వెబ్ సిరీస్, టీవీ షోస్, డైలీ సీరియల్స్ నిర్మాణానికి పూనుకున్నారు. తొలిసారి సినీ నిర్మాతగా కూడా మారి తీస్తున్న చిత్రం “అందరూ బాగుండాలి అందులో నేనుండాలి”.ఇందులో అలీతో పాటు సీనియర్ నరేష్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. శ్రీపురం కిరణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లోని అన్నపూర్ణా స్టూడియోలో జరిగింది.

ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్.వి.కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి, బోయపాటి శ్రీను, జీవిత రాజశేఖర్, బాబీ తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, నిర్మాత అలీ మాట్లాడుతూ, “మలయాళంలో వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన “వికృతి” చిత్రం అక్కడ మంచి విజయం సాధించింది. చక్కటి కామెడీ డ్రామా ఇందులో ఉంది. ఈ చిత్రం నాకెంతో బాగా నచ్చడంతో వెంటనే నరేష్ ను చూడమని చెప్పాను. ఆయనకు ఈ చిత్రం ఎంతో బాగా నచ్చింది. అందుకే ఈ సినిమాను సొంతగా నిర్మించడానికి పూనుకున్నాను. పవిత్ర లోకేష్, సాయికుమార్ తమ్ముడు రవిశంకర్ ఈ సినిమాలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు రాకేష్ గీత రచయిత భాస్కరభట్ల వంటి మంచి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు” అని చెప్పారు,.
Must Read ;- ఐ.యమ్.డీ.బీ టాప్ 10 వెబ్ సిరీస్ 2020 లిస్ట్ ఇదే











