చంద్రబాబే శాశ్వతంగా అధికారంలో ఉండాలనే దురాలోచనతో కరోనా వ్యాక్సిన్లు వేయడం లేదని ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.దుష్ఫచారం చేసే వారిపై కేసులు పెట్టాలని జనం కోరుతున్నారని కొడాలి నాని చెప్పారు. 440కె కరోనా కర్నూలులో కాదు, చిత్తూరు జిల్లా నారావాలిపల్లిలో 70 సంవత్సరాల కిందట చంద్రబాబు రూపంలో 420కె పుట్టిందని కొడాలి ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు బాకా కొట్టే మీడియా సంస్థలు ఏపీలో ఎక్కువ మందికి కరోనా రావాలి, వ్యాక్సిన్లు రాకూడదని కోరుకుంటున్నాయని కొడాలి పేర్కొన్నారు. ఏపీ ప్రజలను కొన్ని మీడియా సంస్థలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయని కొడాలి విమర్శించారు. చంద్రబాబుకు పిచ్చి ఎక్కిందని ర్యాబిస్ వ్యాక్సిన్ వేయాలని కొడాలి ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబుకు బాకా కొట్టే మీడియా సంస్థల యజమానులకు కూడా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించాలని కొడాలి ధ్వజమెత్తారు.
కరోనా వ్యాక్సిన్ కొనుగోలుకు ఎంతైనా ఖర్చు చేయడానికి సీఎం సిధ్దం
ఏపీ సీఎం జగన్ కరోనా వ్యాక్సిన్ కొనుగోలుకు ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్దంగా ఉన్నా,టీకాలు అందుబాటులో లేవని మంత్రి కొడాలి నాని మీడియాకు తెలిపారు.తక్షణం రూ.1600 కోట్లు ఇస్తాం, వ్యాక్సిన్లు ఇప్పిస్తారా అని చంద్రబాబును ప్రశ్నించారు. రోజుకు 6 లక్షల వ్యాక్సిన్లు వేయాలని యంత్రాంగాన్ని సీఎం సిద్దం చేశారని, ఇందుకు రూ.1600 కోట్లు ఖర్చు చేసేందుకు సీఎం వెనకాడతారా? అని ప్రశ్నించారు. కేంద్రం కేవలం 3,45,000 డోసులు మాత్రమే ఏపీకి ఇవ్వమన్నదని భారత్ బయోటెక్ లేఖ రాసిందని మంత్రి కొడాలి నాని మీడియాకు లేఖను ప్రదర్శించారు. సీరం సంస్థ కూడా ఇప్పట్లో కరోనా టీకాలు ఇవ్వలేమని సమాధానం చెప్పిందని ఆయన వెల్లడించారు.











