అందం, అభినయంతో తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైన హీరోయిన్ లలో మలయాళ బ్యూటి మీరా జాస్మిన్ ఒకరు.అమ్మాయి బాగుంది చిత్రంతో టాలీవుడ్లో ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ భద్ర, గుడుంబా శంకర్, గోరింటాకు వంటి చిత్రాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. తెలుగు, మలయాళం, తమిళ సినిమాల్లో నటించిన మీరా జాస్మిన్ తన నటనతో అందరినీ ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు. తన అభినయంతో మంచి అవకాశాలు దక్కించుకున్న ఈ మలయాళ కుట్టి 2004లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని కూడా అందుకుంది.
కెరీర్ బిగినింగ్‌లో అందాల ఆరబోతకి అంతగా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఈ అమ్మడు.ఒకప్పటి స్టార్ హీరోయిన్ సౌందర్య తరహాలో కేవలం అభినయంతోనే మంచి అవకాశాలు అందుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది.చక్కని కట్టు బొట్టుతో ఫ్యామిలీ ఆడియన్స్ నే కాదు కుర్రకారును కూడా ఫిదా చేసిన ఈ బ్యూటీ వరుస ఆఫర్లు వస్తున్న సమయంలోనే తన సినీ కెరీర్ కి బ్రేక్ ఇచ్చేసింది.
2014లో దుబాయ్ కి చెందిన అనిల్ జాన్ టైటస్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను పెళ్ళి చేసుకున్న మీరా జాస్మిన్, తర్వాత వైవాహిక జీవితానికే అంకితమైపోయింది.అయితే ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడకపోవడంతో ఆమె తన భర్తకు విడాకులిచ్చేసింది. కాగా ఇన్నేళ్ళ తర్వాత ఈ అమ్మడు ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
సినిమా ఇండస్ట్రీలో రాణించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్న మీరా జాస్మిన్ సోషల్ మీడియాను వేదికగా చేసుకుంది.గతంలో ఎన్నడూ లేని విధంగా తరచుగా తన అందాల ఆరబోతతో కూడిన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తూ కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.మీరా జాస్మిన్ నుంచి ఈ తరహా హాట్ పిక్స్ ను చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. వరుస ఫోటో ఘాట్ లతో చెలరేగిపోతున్న మీరా జాస్మిన్.. మరోసారి తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది.
నాలుగుపదుల వయసులోకి చేరిన మీరా జాస్మిన్ తాజాగా ఆకుపచ్చ డ్రెస్ లో అందాల ఆరబోతతో దర్శనమిచ్చింది. మీరా రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాలని భావిస్తోందని..పెద్ద చిత్రాల్లో అవకాశాల కోసమే మునుపెన్నడూ లేని విధంగా ఇలా గ్లామర్ షోతో హీట్ పుట్టిస్తోందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ ఇటీవల మలయాళ చిత్రం ‘మగల్’ లో జయరామ్ భార్యగా నటించింది.అయితే అది గెస్ట్ రోలే అయినప్పటికీ ఆ మూవీలో మీరా నటనకు మంచి మార్కులే పడ్డాయని టాక్. ఇక త్వరలోనే ఈ మలయాళ కుట్టి టాలీవుడ్ లో కూడా ఓ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.ఇప్పటికే పలువురు టాలీవుడ్ దర్శక నిర్మాతలు ఈమెను సంప్రదిస్తున్నారనే వార్తలు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వినిపిస్తున్నాయి.కాగా ప్రస్తుతం మీరా జాస్మిన్ హాట్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి..