‘వి’ సినిమా దారుణం గా నిరాశపర్చడంతో హీరో నాని సైలెంట్ గా ,”టక్ జగదీష్” షూటింగ్ పనుల్లో మునిగి పోయారు . తన తదుపరి సినిమా , సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో – రాహుల్ డైరెక్షన్ లో చేయబోతున్నారు నాని శ్యామ్ సింగ రాయ్ ‘ అని పేరు పెట్టిన ఈ సినిమాలో – సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటించబోతుంది. మిడిల్ క్లాస్ అబ్బాయి తర్వాత నాని – సాయి పల్లవి కాంబినేషన్ కావడం , ఈ సినిమా మీద ఆసక్తి రేకెత్తించింది .
అయితే ఈ సినిమాలో మరికొన్ని హీరోయిన్లా పాత్రలున్నాయి. నివేద థామస్ , రష్మిక మందన్న .. ఇలా రకరకాల పేర్లు వినబడ్డాయి. ఇప్పుడు వారెవ్వరు చేయడం లేదని తెలుస్తోంది. ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన కృతి శెట్టి ని ” శ్యామ్ సింగ రాయ్” లో మరో హీరోయిన్ గా సెలెక్ట్ చేసారు . ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేయాలనీ చూస్తున్నారు.