ప్రముఖ గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. గత జనవరి 11న ఆమె తీవ్ర అస్వస్థతకు లోనైన సంగతి తెలిసిందే. బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ఆమె శ్వాసకోశ సమస్యతో బాధపడుతున్నారు. ఆ తర్వాత ఆమె కరోనా నుంచి కోలుకున్నారు. ఇంతలోనే మళ్లీ ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆమె వయసు 92 సంవత్సరాలు.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగానే ఉందని హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది సెప్టెంబరు 28న ఆమె జన్మదినం సందర్భంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ధర్మేంద్ర, హేమామాలిని, మాధురీ దీక్షిత్, ఏఆర్ రెహ్మాన్, శ్రేయా గోశల్ ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఆమెకి సోషల్ మీడియా వేదికగా ఆమెకి విషెస్ చెప్పారు.
ఒక్క హిందీలోనే వెయ్యికి పైగా పాటలు పాడిన ఆమె భారత రత్న అవార్డును కూడా పొందారు. అలానే 2001లో ది హయ్యెస్ట్ సివిలియన్ హానర్ అనే అవార్డుని దక్కించుకున్నారు. ఆమె ఆనారోగ్యం పాలవ్వడంతో కుటుంబసభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ట్విట్టర్ ద్వారా ఎప్పటికప్పుడు వెల్లడిస్తున్నారు.











