చర్యలు తీసుకోకుంటే మనుగడ కష్టం!
ఏపిలో జాతీయ గ్రిడ్ నుంచి అనుమతించిన దానికంటే అధికంగా విద్యుత్ ను రెండు రోజులుగా తీసుకుంటున్నారని, పరిస్థితిని సర్దుబాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యుత్ సంస్థలకు పవర్ సిస్టం ఆపరేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ లేఖ రాసింది. అలా సర్దుబాటు చేయకుంటే జాతీయ గ్రిడ్ ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పొసోకో ( పవర్ సిస్టం ఆపరేషన్ లిమిటెడ్ ) హెచ్చరించింది. ఈ మేరకు ట్రాన్స్ కో సీఎండీ శ్రీకాంత్ కు పొసోకో లేఖ రాసింది. రాష్ట్ర విద్యుత్ సంస్థల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. నిర్దేశించిన లోడ్ కంటే ఎక్కువ విద్యుత్ ను జాతీయ గ్రిడ్ నుంచి తీసుకుంటున్నాయి ఏపీ విద్యుత్ సంస్థలు.
ప్రమాదంలో జాతీయ పవర్ గ్రిడ్!
ఏపీలో గడిచిన మూడు రోజులగా విద్యుత్ కోతలు అధికమైయ్యాయి. అయితే బొగ్గు కొరత, బొగ్గు కొనుగోలు సరిపడా నిధులు కేటాయించకపోవడం, ఎన్టీపీసీ కి చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాలతో రాష్ట్రావరసరాల కోసం వినియోగించబడుతున్న 2 వేల మోగా వాట్ల విద్యుత్ ను అర్థాంతరంగా నిలిపివేసింది. మరోవైపు రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు( ఆర్టీపీపీ ) లోని మరో యూనిట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేసినా.. బొగ్గు నిల్వలు లేవని, బొగ్గు నిధులు విడుదల చేయకుంటే ఏం చేయాలని అధికారులే ప్రభుత్వాని నిలదీశారు. మరోవైపు కృష్ణపట్నంలో ఒక యూనిట్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో కేవలం 810 మోగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ కూడా కేవలం 5 రోజులకు సరిపడా ( 80 వేల మెట్రిక్ టన్నులు ) బొగ్గు మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో జాతీయ గ్రిడ్ నుంచి 3వ తేదీన 1,565 మెగావాట్లు, 4వ తేదీన 1,485 మెగా వాట్ల ఎక్కవ విద్యుత్ ను తీసుకుంటున్నాయి రాష్ట్ర విద్యుత్ సంస్థలు! దీనివల్ల జాతీయ గ్రిడ్ ప్రమాదంలో పడింది. జాతీయ విద్యుత్ గ్రిడ్ కోడ్( ఐఈజీసీ ) నిబంధనలకు లోబడే జాతీయ గ్రిడ్ నుంచి విద్యుత్ ను తీసుకోవాలని పొసోకో పేర్కొంది. ఇప్పటికైనా ఏపీలో నెలకొన్న విద్యుత్ సంక్షోభాన్ని యుద్దప్రాతిపదికన ఉత్పత్తిలోకి తేవాలని సూచించింది!
Must Read-ఏపీలో చల్లారని సెగలు..! ఉద్యమిస్తున్న నిరుద్యోగులు..!!











