దేశంలో కరోనా సెకండ్ వేవ్ కాస్తా తగ్గుముఖం పడుతోంది. దీంతో పాజిటివ్ కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 86,498 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొన్నటి వరకూ లక్షకు పైగా నమోదైన కేసులు నిన్న మాత్రం 86 వేలకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. 2,123 మంది మృతి చెందగా, 1,82,282 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా టీకా తీసుకున్న వారి సంఖ్య 23,61,98,726కు చేరుకుంది.
Must Read ;- ఐదు రోజుల్లో కొవిడ్ ఖతం.. కరోనా కట్టడిలో ఇజ్రాయెల్ మరో ముందుడగు











