సికింద్రాబాద్ మిలటరీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు ఇవాళ ఢిల్లీలో ప్రతిష్ఠాత్మక వైద్య సంస్థ ఎయిమ్స్‌లో చేరారు.నిన్ననే ఎయిమ్స్‌లో చేరాలని ఎంపీ ప్రయత్నించినా ప్రత్యేక గది అందుబాటులో లేకపోవడంతో ఆయన నివాసానికి వెళ్లిపోయారు.ఇవాళ రఘురామ ఆర్యోగ్యంపై కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి హర్షవర్థన్ ఫోన్లో అడిగి తెలుసుకున్నారు.ఎయిమ్స్ డైరెక్టర్‌కు మంత్రి ఫోన్ చేసి రఘురామరాజుకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారని తెలుస్తోంది.దీంతో ఎంపీ రఘురామరాజుకు ఎయిమ్స్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఎయిమ్స్‌లో కోవిడ్ వార్డులు ఉండటం వల్లే..
ఢిల్లీ ఎయిమ్స్‌ను కోవిడ్ కేర్ సెంటరుగా మార్చారు.దీంతో నిన్న ఎంపీ రఘురామరాజు ఎయిమ్స్‌కు వెళ్లినా అక్కడ ఇన్ పేషెంటుగా చేరలేకపోయారు.ఆయనకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడానికి సమయం కావాలని ఎయిమ్స్ డైరెక్టర్ కోరడంతో రఘురామరాజు నిన్న ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసానికి వెళ్లిపోయారు.ఇవాళ ఎయిమ్స్‌లో పూర్తి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.బీపీలో హెచ్చుతగ్గులు ఉన్నాయని ఎంపీ రఘురామరాజు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో అన్ని పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.










