తిరుపతిలో ప్రచారం చేస్తున్న చంద్రబాబుపై రాయి విసరడం ఖచ్చితంగా వైసీపీ ఫ్యాక్షన్ కుక్కల పనే అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. రాయి వేయడంపై ఆయన ట్విటర్‌లో ఘాటుగా స్పందించారు. తిరుపతి కొండపై క్లైమోర్ మైన్లు పెట్టి పేల్చితే ఏడుకొండలవాడే కాపాడిన ప్రాణం చంద్రబాబుదని, అంతటి దాడి నుంచి తేరుకుని సహచరుల గురించి వాకబు చేసిన గుండె ధైర్యం చంద్రబాబుదని ట్వీట్ చేశారు. నీలాంటి ఫ్యాక్షన్ కుక్క మూతి పిందెలు వేసే రాళ్లు ఆయనను భయపెట్టలేవన్నారు. చంద్రబాబు సభలకు వస్తున్న జనాన్ని చూసి ఓర్వలేకే దాడులు చేయిస్తున్నారన్నారు.
Must Read ;- అలిపిరి ఘటనకే భయపడలేదు, రాళ్ల దాడికి భయపడతానా? : చంద్రబాబు నాయుడు
నీలాంటి ఫ్యాక్షన్ కుక్కమూతిపిందెలు వేసే రాళ్లు ఆయనని భయపెట్టలేవు. జగన్ నీ ప్రిజనరీ బుద్ధితో రాళ్లేయిస్తే,అదే రాళ్లతో జనానికి పనికొచ్చే ఒక నిర్మాణం చేయించగల విజనరీ చంద్రబాబు గారు.తిరుపతిలో నా సవాల్ కి తోకముడిచి తొలి ఓటమి అంగీకరించావ్.(2/3)
— Lokesh Nara (@naralokesh) April 12, 2021