పార్టీ ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన ఉగాది ఉత్సవాలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తిరుమల తిరుపతి టీడీపికి కంచుకోట అని అన్నారు. రెండేళ్ల వైసీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయలేదని విమర్శించారు. టీడీపీ హాయంలోనే తిరుమల అన్ని రంగాల్లో ముందుకెళ్లిందన్నారు. ఎన్టీఆర్ తో పాటు నేను, ఇతర నాయకులు తిరుమల పవిత్రతను కాపాడామన్నారు. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రభుత్వం రాజకీయ పబ్బం గడుపుకుంటుందని, అవి నవ మోసాలని ఆరోపించారు. వైసీపీ రౌడీలకు భయపడేది లేదని తేల్చి చెప్పారు. అలిపిరి ఘటనలో మైన్స్ కు భయపడని నేను.. ఈ రాళ్ల దాడికి భయపడతానా…? అని ఘాటుగా స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది భక్తులు తిరుమలకు వస్తారని, భక్తుల మనోభావాలను, ఆలయ పవిత్రతను కాపాడాల్సిన వైసీపీ ప్రభుత్వం అరాచక పాలనను కొనసాగిస్తుందని మండి పడ్డారు. టీడీపీ కార్యకర్తలు అధైర్యపడొద్దని, ప్రజలే వైసీపీకి బుద్ధి చెప్తారన్నారు.
Must Read ;- వైసీపీ ప్యాక్షన్ రాళ్లు ఆయన్ను భయపెట్టలేవు.. నారా లోకేష్