మరి అంత ఇబ్బందిగా ఉంటే చేయడం ఎందుకో..! లవర్ బాయ్ ఇమేజ్ పోతుంది అని భయంగా ఉంది అని రీసెంట్ గా ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు నాగ శౌర్య..! దీనికి మీడియాతో సినిమా సర్కిల్స్‌లో కూడా ఫన్నీ కామెంట్స్ వినిపిస్తున్నాయి..! హాయిగా లవర్ బాయ్ ఇమేజ్ ఉంటే కనీసం మినిమం గ్యారంటీ ఐనా ఉండేది అని ఇప్పుడు ఈ మాస్ ఇమేజ్ కి వస్తే మాత్రం గ్యారంటీ లేని కెరీర్ ఐపోతుంది అని అంటున్నారు..! ఐనా మనోడిని మాస్ హీరో గా ఆక్సెప్ట్ చేయాల్సింది జనాలు అని..! ఇండైరెక్ట్ గా తాను మాస్ హీరో ఐపోయాను అని చెప్పుకున్నా అది జరగని పని అని కామెంట్స్ వినిపిస్తున్నాయి..!
హాయిగా ఫీల్ గుడ్ సినిమాలు చేసుకోక ఎందుకు ఈ బాధ అనే వారు లేకపోలేదు..! ఐతే దీనికి శౌర్య తన సన్నిహితులు వద్ద ఒకే మాట చెబుతున్నాడు అని తెల్సింది..! ఏమి లేని బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ మార్కెట్ ఇప్పుడు దాదాపు 12 కోట్లు ఉందని..! ఇది కేవలం శ్రీనివాస్ మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడం వల్లే సాధ్యం అయ్యింది అని చెబుతున్నాడు అట..! ఐతే శౌర్య మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తుంది హిందీ రైట్స్ పెంచుకోవడం కోసమా…? అనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తోంది.
హీరో సాధారణంగా తనలో ఉన్న కంటెంట్ ను బట్టి, తనకు ఉన్న ఫాలోయింగ్, తన చిత్రాల్లో ఎలాంటి వాటికి ఎలాంటి ఆదరణ దక్కుతోందనే స్టాటిస్టిక్స్ ను బట్టి.. కొత్త సినిమాలను ఎంచుకోవాలి. అంతే తప్ప.. ఎవరో మరో హీరో.. యాక్షన్ సినిమాలు ట్రై చేయడం వల్ల.. హిందీ మార్కెట్ క్రియేట్ అయింది గనుక.. తను కూడా యాక్షన్ సినిమాలే ట్రై చేయాలని అనుకుంటే.. ఏదో వాతలు పెట్టుకున్న మాదిరిగా ఉంటుందని అంతా అనుకుంటున్నారు.