మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో పోలింగ్ రోజున రెండు ప్యానల్స్ మధ్య ఉదయం సుహృద్భావ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలింగ్ రసాభాసగా సాగింది. ఒక దశలో మోహన్ బాబు ఆవేశంతో ఊగిపోయారు.దాంతో పోలింగ బూత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బెనర్జీపై మోహన్ బాబు ఆగ్రహం. బెనర్జీకి నరేష్ కీ మధ్య వాగ్వాదం జరిగింది. చంపేస్తానంటూ మోహన్ బాబు బెనర్జీని బెదిరించారు. ఉదయం 10 గంటలకల్లా పోలింగ్ 200 దాటింది.
సమీర్ పై శివబాలాజీ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. గొడవలు జరిగితే పోలింగు రద్దుచేస్తామంటున్న ఎన్నికల అధికారులు. ఎవరికి వారే ధీమాగా వ్యవహరిస్తున్నారు. రిగ్గింగ్ చేస్తున్నరన్న ఆరోపణలు కూడా వినవచ్చాయి. ప్రచారం లోపల చేయడం వల్ల గొడవ జరిగినట్టు సమాచారం. మా ఎన్నికల వ్యవహారంపై కోర్టుకు వెళతామని ఎన్నికల అధికారి అన్నారు. సీసీ టీవీ ఫుటేజిీ పరిశీలిస్తామన్నారు. సభ్యులు కానివారు ముసుగు వేసుకొచ్చి దొరికిపోయినట్టు సమాచారం.
అంతరాత్మ చెప్పినట్టు ఓటేశా: చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి ఉదయానే వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతరాత్మ చెప్పినట్టు ఓటేశానని చిరంజీవి అన్నారు. ఈసారి వాడివేడిగా ఎన్నికలు జరిగాయని, ప్రతిసారీ ఇలా జరుగుతాయని అనుకోనక్కరలేదన్నారు. భవిష్యత్తులో ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. కొందరు షూటింగుల్లో పాల్గొనకపోవడం వల్ల ఓటు వేయకపోవచ్చారు.
మనస్సాక్షి చెప్పినట్టు ఓటేశా: బాలకృష్ణ
తన మనసు చెప్పినట్టు ఓటేశానని నందమూరి బాలకృష్ణ అన్నారు. రెండు ప్యానల్స్ బాగానే చేస్తాయి. అందరూ కలిసి సినిమాల్లో పనిచేయాల్సినవాళ్లమే. ఎవరి ఓపీనియన్స్ వాళ్లకు ఉంటాయి. అందరూ న్యాయం చేసేవాళ్లలాగానే అనిపిస్తున్నారు. రెండు వర్గాలు అంటూ ఏమీ లేవు. ఇంత హడావుడి ఎప్పుడూ లేదు. వాళ్లు చేస్తారు.. చేయకపోతే మేం వెనకాల ఉన్నాం. వాళ్ల వాళ్ల మ్యేనిఫెస్టోలు ఉన్నాయి. సంక్షేమం అన్నది ఎవరు గెలిచినా అందరికీ అందుతుంది. ఎంతో ఆహ్లాదకర వాతావరణం ఉంది. మాటలు చెప్పడమే కాదు ఇద్దరూ చేతల్లో చూపించేవారే. మాకు కావలసింది ఇండస్ట్రీ అభ్యున్నతి. సభ్యుల అవసరాలను వీరు తీరుస్తారని నమ్ముతుంది. మనస్సాక్షిగా నా ఓటు వేశాను.
మాలో చీలిక ఉండదు.. అంతా ఒక్కటే పవన్ కళ్యాణ్
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ కూడా ఉదయానే వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలపై ఆయన స్పందించి మాట్లాడారు. తాను చాలాసార్లు ‘మా’ ఎన్నికల్లో ఓటు వేశానని, ఈస్థాయిలో వివాదాలు ఎప్పుడూ చూడలేదన్నారు. ఈ ఎన్నికల కోసం ఇంత హడావుడి అవసరం లేదు. సినిమాలో చీలిక అనే ప్రశ్నే ఉండదు. పరిశ్రమ పలుదారుల్లో వెళ్లినా చీలడం అనేది జరగదు. కూర్చుని మాట్లాడుకుంటే చిన్నచిన్న సమస్యలు అవే తొలగిపోతాయి. ఇక్కడ అది మిస్ అయిందనిపించింది. అన్నయ్య, చిరంజీవి, మోహన్‌బాబుగారు స్నేహితులు’ అన్నారు.











