ఎడతెరుపు వర్షాలతో భారీగా నష్టపోయిన పంటలు!
ఏపీలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి. గతంలో ఎన్నడూలేని విధంగా కుంభవృష్టిగా వర్షాలు పడ్డాయి. దీంతో సాంప్రదాయంగా పండించే పంటలేకాదు.. వాణిజ్య పంటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి. పండ్లు, కూరగాయాల పంటలు ఒక స్ధాయిలో నష్టపోయి .. రైతులు తీవ్ర కష్టాల్లోకి నెట్టివేశాయి. ఈ మధ్య చిత్తూరు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు టమాట ధర కొండెక్కింది. బహిరంగ మార్కెట్లో రూ.150 నుంచి రూ.180 వరకు టచ్ అయింది. వీటికి తోడు మునక్కాయ కూడా మీషం మెలేసింది! చిత్తూరు జిల్లా మదనపల్లెలో మునక్కాయ కిలో రూ. 600 పలికి దేశంలోని ఆల్ టైం రికార్డు ధరను బద్దలకొట్టింది. శనివారం మదనపల్లె కూరగాయల మార్కెట్ చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో మునక్కాయల ధర పలికింది. ధర రూ. 600 వెచ్చించి కిలో కొనగోలు చేసినా.. కేవలం 12 నుంచి 18 మాత్రమే తూగతున్నాయి. అలానే మార్కెట్లో ఏ రకం కూరగాయలైనా.. కిలో రూ.80 నుంచి రూ.150 మధ్య పలకడం విశేషం.











