రాప్తాడు ఎమ్మెల్యే జోకేశాడా? కావాలనే ఆ డైలాగ్ పేల్చాడా??
జగన్ రెడ్డి కోడికత్తికేసు ఏమైంది…? మరోసారి కదిరి నుంచి కత్తి తెచ్చి పోడిపిస్తారా..?? జగన్ రెడ్డి కోడికత్తి కేసు వెనుకెవరున్నారన్నది నేటికి ఒక చిదంబర రహస్యమేగా..! మరి బాబాయి వైఎస్ వివేక హత్య కేసు కొలిక్కి వచ్చినట్లే వచ్చి .. నేటికి అనేక మలుపులు తిరుగుతూనే కొలిక్కిరాని మజిలీలా సాగుతోందేగా…! ఇవన్నీ ఇలా ఉన్న క్రమంలో శనివారం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి బ్లాస్టింగ్ డైలాగ్ ఒకటి కొట్టాడు! సార్ వాడిన డైలాగ్ కు రాష్ట్రం మొత్తం ఒకటే రచ్చ ..! తరువాత దానిపై సోషల్ మీడియా పెద్ద చర్చా .. ! ఎమ్మెల్యే కామెంట్స్ మొదటిది జగన్ రెడ్డి హత్యకు కుట్ర జరుగుతోందని! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడికత్తితో రాజకీయం .. అధికారంలో వచ్చిన తరువాత జగన్ రెడ్డి హత్యకు కుట్ర అంటూ వైసీపీ నేతలు మాట్లాడడం పెద్ద విడ్డూరమే! అప్పటికీ .. ఇప్పటికీ చూసుకుంటే కామన్ పాయింట్ ఒక్కటే.. అదే హత్య రాజకీయం! సీఎం జగన్ ను హత్య చేసి చంద్రబాబు అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడని ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ యొక్క సారాంశం! అలా హత్యకు కుట్ర చేయకుండా.. చంద్రబాబు అధికారంలోకి రాలేడని ఎమ్మెల్యే ప్రకాష్ అభిప్రాయం కాబోలు!! మరి ప్రజాక్షేత్రంలో రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు, ప్రజాప్రతినిధుల ఎన్నిక, ముఖ్యమంత్రి పీఠంపై లీడర్..! ఇవన్నేంటి మరి.. మీ దృష్టిలో బుల్షిట్ నా..? ఎమ్మెల్యే ప్రకాష్ కూడా హత్య చేసే రాప్తాడుకు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడా? అన్నది కామన్ మేన్ అనుమానాలు. హింసా రాజకీయాకు అర్థమేమిటో వైసీపీలోని ప్రజాప్రతినిధులను, మంత్రులను అడిగితే తెలుస్తోంది!… కుంభకోణాల పేరును కూడా ప్రస్తావించే నైతిక హక్కు అధికారపార్టీ లేదు .. ఎందుకంటే ఆ కుంభకోణం కూడా బెంబెలెత్తిపోయేంత అవినీతి ఈ రెండునరేళ్లల్లో జరిగింది కాబట్టే!.. ప్రజలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఆరోపిస్తున్న విషయం తెలియదు కోబోలు!! మరి ఉన్నంట్లుండి ఇప్పడు మేల్కొన్న ప్రకాష్ రెడ్డి వాడిన మాటల్లో ఇన్నర్ అండ్ ఇన్ సైడ్ వ్యూహం లేకపోలేదని టీడీపీ నేతలు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
దొంగలుపడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగిన సామెతలా?
అసలు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మొన్న కేంద్ర మంత్రి పీయూస్ అన్నట్లు చిత్రవిచిత్రల పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి! మానోవైకల్యంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నారన్నది రాష్ట్ర ప్రజలకు వస్తున్న అనుమానాలు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీవర్షాలకు వరదలొస్తే .. ఆయా జిల్లాలో నవంబర్ 23న చంద్రబాబు పర్యటించారు. అప్పుడు చంద్రబాబు చేసిన కామెంట్స్ అప్పుడే కౌంటరివ్వకుండా.. ప్రకాష్ రెడ్డి శనివారం కామెంట్స్ చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఈ 20 రోజులు ఎమ్మెల్యే గారు ఎక్కడు పోయాడు? అప్పుడు చేయని కామెంట్స్ మరి ఇప్పుడు ఎందుకు చేస్తున్నాడు? సీఎం జగన్ రెడ్డిని హత్య చేయాలని చంద్రబాబు చూస్తున్నాడు అని చేసిన వ్యాఖ్యలు దేనికి సంకేతం? ఇవే ప్రశ్నలు పలు అనుమానాలను లేవనెత్తుతున్నాయి. కోడి కత్తికి పిడి ఎవరో ఇంతవరకు తెలిసిరాలేదులే కానీ .. బాబాయి వివేక హత్యకు వాడిన గొడ్డలి మాత్రం కదిరి నుంచి తెప్పించామని డ్రైవర్ దస్తగిరి ఒప్పుకున్నాడుగా? మరి జగన్ రెడ్డి హత్యా నాటకానికి వాడే ఆయుధం రాఫ్తాడులో తయారు చేస్తున్నారా? లేక కడప కొలిమిలో సాన పెడుతున్నారా? అని రాప్తాడు ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ కు కౌంటర్ గా నెట్టింట్లో తమ్ముళ్లు తెగ కామెంట్స్ పెడుతున్నారు.











