తమిళ దళపతి విజయ్ .. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘మాస్టర్’ సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది ఆరంభంలోనే విడుదల కావాలి. కానీ లాక్ డౌన్ కారణంగా.. ఇప్పటివరకూ విడుదల కాలేకపోయింది. మాస్టర్ విడుదల అవ్వగానే మురుగదాస్ సినిమాను ప్రారంభించాలన్నది విజయ్ ప్లాన్. అప్పట్లో ఈ సినిమాకి సంబంధించిన ప్రకటన కూడా వచ్చింది. ఇప్పుడిప్పుడే కరోనా ఎఫెక్ట్ నుంచి బైటపడి నెమ్మదిగా షూటింగ్స్ మొదలుపెడుతోన్న కోలీవుడ్ పరిశ్రమలో.. ఇంత వరకూ విజయ్ మురుగదాస్ సినిమాకి సంబంధించిన అప్టేట్ లేకపోవడంతో అభిమానులు పూర్తిగా డిజప్పాయింట్ అవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడో న్యూస్ కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. అదేంటంటే.. విజయ్ కొత్త సినిమా నుంచి మురుగదాస్ తప్పుకున్నాడట. సన్ పిక్చర్స్ వారు మురుగదాస్ ను కాదని మగిళ్ తిరుమేని అనే దర్శకుడ్ని ఎంపికచేశారట. గతంలో విజయ్ తో సక్సెస్ ఫుల్ మూవీ తీసిన మగిళ్ తిరుమేని.. మురుగదాస్ స్థానంలోకి ఎందుకొచ్చాడనేది కోలీవుడ్ లో చర్చనీయాంశం అయిందట. విజయ్ మురుగ కాంబో లో వచ్చిన తుపాకీ, కత్తి, సర్కార్ లాంటి సినిమాలు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
అలాంటిది అదే కాంబినేషన్ లో మరో సినిమాకి సన్ పిక్చర్స్ వారు ఎందుకు అడ్డుపడుతున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. మొత్తం మీద విజయ్ 65కి దర్శకుడిగా మురుగదాస్ స్థానంలో మగిళ్ తిరుమేని వచ్చిచేరడం అభిమానుల్ని తీవ్రంగా నిరాశపరుస్తోందట. ఈ విషయం అధికారికంగా ప్రకటించడం ఒక్కటే తరువాయి. మరి ఈ ప్రాజెక్ట్ నుంచి మురుగదాస్ నిజంగానే క్విట్ అయ్యాడో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.











