దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రంగం సిద్ధమైంది. సురేష్ బాబు రెండో కుమారుడు, రానా సోదరుడు అభిరామ్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రానికి తేజ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల దగ్గుబాటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన పులు ఆసక్తికరమైన విషయాలను ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో బయటపెట్టారు.
ఇంతకీ ఏం చెప్పారంటే.. తను నటించేబోయే ఫస్ట్ మూవీ ప్రేమకథా చిత్రమని.. ఇందులో మంచి కంటెంట్ ఉంటుందని చెప్పారు. అంతే కాకుండా.. తన రియల్ లైఫ్ లో జరిగిన కొన్ని సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయని చెప్పారు. తన చేసే ఏ సినిమాలో అయినా కంటెంట్ ఉంటుంది. కంటెంట్ ఉన్న కథలతోనే సినిమాలు చేయాలనుకుంటున్నాను అని తెలియచేశారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. కృతి శెట్టిని ఈ సినిమాలో హీరోయిన్ అనుకున్నారట.
అయితే.. ఈ బ్యూటీ డేట్స్ ఖాళీ లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అభిరామ్ కు జోడిగా ఉత్తరాది భామ నుపూర్ సనన్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. 1 నేనొక్కడినే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన హాట్ బ్యూటీ కృతి సనన్ చెల్లెలే నుపూర్ సనన్. ప్రైవేట్ ఆల్బమ్ ద్వారా ఫేమస్ అయిన సోదరిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి తీసుకురావాలని కృతి సనన్ ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. మరి.. అభిరామ్ సరసన నటించేందుకు ఈ ఉత్తరాది భామ ఓకే చెబుతుందో లేదో చూడాలి.











