బాపు దర్శకత్వంలో కృష్ణం రాజు టైటిల్ రోల్ పోషించిన భక్తి రస చిత్రం ‘భక్త కన్నప్ప’. రెబల్ స్టార్ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. నిజానికి ఈ సినిమా అంతకు ముందు వచ్చిన ‘కాళహస్తి మహాత్మ్యం’ సినిమాకి రీమేక్ వెర్షన్. అందులో తిన్నుడుగా కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించి మెప్పించారు. ఆయన నటించిన అదే మొదటి , ఆఖరి తెలుగు సినిమా.
ఆ వెర్షన్ నే .. తన స్టైల్లో మార్చి స్ర్కిప్ట్ రాసుకొని.. తన దర్శకత్వంలో సినిమా గా తీయాలని తనికెళ్ళ భరణి భావించారు. అప్పట్లో అందులో సునీల్ హీరోగా నటిస్తాడని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ తర్వాత ఆ స్ర్కిప్ట్ మంచు వారి ఫ్యామిలీకి చిక్కింది. విష్ణు హీరోగా ‘భక్త కన్నప్ప’ సినిమాను తెరకెక్కించాలని మోహన్ బాబు అప్పట్లో అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి ఊసే లేదు. ఇప్పుడు మరోసారి ‘భక్త కన్నప్ప’ సినిమా వార్తల్లో నిలిచింది.
తనికెళ్ళ భరణి రాసిన స్ర్కిప్ట్ ను హాలీవుడ్ లో మరో రచయితతో ఇంకో వెర్షన్ రాయించానని , తాను కూడా ఓ వెర్షన్ ను సిద్ధం చేశానని. తాను రాసిన వెర్షన్ తోనే స్టార్ రైటర్ బుర్రా సాయిమాధవ్ .. ‘భక్త కన్నప్ప’ సినిమా కథ రాస్తున్నారని, త్వరలోనే ఈ సినిమా ఉంటుందని, భక్త కన్నప్ప తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని.. ఢీ అంటే ఢీ తర్వాత ఈ సినిమా ఉంటుందని విష్ణు చెబుతున్నాడు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుందట. మరి ఈ సినిమాకు దర్శకుడిగా ఎవరిని నియమిస్తారో చూడాలి.
Must Read ;- ‘మోసగాళ్ళు’ మూవీకి ఇతర భాషల్లో టైటిల్స్ ఇవే!