ప్రస్తుతం టాలీవుడ్ లో అందరి కళ్ళూ ..భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఎపిక్ లవ్ స్టోరీ ‘శాకుంతలం’ మీదే ఉన్నాయి. ఇందులో సమంతా శకుంతల పాత్రను పోషిస్తుండగా.. మలయాళ యంగ్ హీరో దేవ్ కమల్ దుష్యంతుడిగా నటించబోతున్నాడు. ఈ రోజు అన్నపూర్ణ స్డూడియో లో గ్రాండ్ గా లాంఛ్ అయిన ఈ సినిమా షూటింగ్ ను అతి త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఇక ఇందులో ఇతర పాత్రల్ని గుణశేఖర్ ఇంకా రివీల్ చేయనప్పటికీ.. ఒక పాత్ర గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అప్డేట్ వచ్చింది.
మహాభారతంలో ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రణయగాథ ఆధారంగా ‘శాకుంతలం’ సినిమా తెరకెక్కుతుండగా.. ఇందులో దూర్వాస మహాముని పాత్ర ఆ కథనే మలుపు తిప్పుతుంది. ఆ ముని శకుంతలకిచ్చిన శాపం వల్లనే దుష్యంతుడితో ఆమె కు వియోగం ఏర్పడుతుంది. ఆ పాత్రను ‘శాకుంతలం’ చిత్రంలో విలక్షణ నటుడు మోహన్ బాబు పోషిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. దూర్వాసుడికి ముక్కు మీదే కోపం ఉంటుంది. ఆయనకి ఎవరిమీదైనా కోపం వస్తే వెంటనే శపిస్తాడు. అంతలోనే దానికి విరుగుడు కూడా సూచిస్తాడు. అందుకే మోహన్ బాబు ను గుణశేఖర్ ఈ పాత్ర కోసం ఎంపిక చేశాడని తెలుస్తోంది. మరి ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
Must Read ;- ఫుల్ స్వింగ్ లో ‘శాకుంతలం’ మ్యూజిక్ సిట్టింగ్స్