క్రేజీ డైరెక్టర్ శంకర్ – మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలోని సూపర్ మూవీ గురించి ఇటీవల అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ సినిమా ఎప్పుడు లాంఛ్ అవుతుంది అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతం స్ర్కిప్ట్ అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. శంకర్ తెలుగులో చేస్తున్న డైరెక్ట్ స్ట్రైట్ మూవీ గా విశేషాన్ని సంతరించుకున్న ఈ సినిమా విషయంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి.
ఈ సినిమాకి ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారట. నిజానికి శంకర్ దగ్గర రైటర్స్ వింగ్ వేరు. ఆయన సూపర్ హిట్ మూవీస్ అన్నిటి వెనుక కొందరు స్పెషల్ రైటర్స్ ఉండేవారు. అయితే ఇప్పుడు దిల్ రాజు నిర్మాత కావడంతో.. బుర్రా సాయిమాధవ్ సీన్ లోకి వచ్చాడు.
అలాగే.. శంకర్ సినిమాలన్నిటికీ దాదాపు ఎ.ఆర్.రహమాన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సినిమాకి కూడా రహమానే సంగీత దర్శకుడు అని అందరూ అనుకున్నారు. అయితే దిల్ రాజు వారందరికీ షాకిస్తూ.. ఈ మూవీకోసం తమన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీగా బహుభాషల్లో విడుదల కాబోతున్న చెర్రీ – శంకర్ మూవీ ఎప్పుడు లాంఛ్ అవుతుందో చూడాలి.
Also Read : మెగాస్టార్ ఆచార్యకు ‘సిద్ధ’మైన రామ్ చరణ్