మంచు విష్ణు హీరోగా, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో హాలీవుడ్ దర్శకుడు జెఫ్ఱీ గీ చిన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మోసగాళ్ళు. వరల్డ్స్ బిగ్గెస్ట్ ఐటీ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచు విష్ణు స్వయంగా నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే విడుదలైంది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా మోసగాళ్ళు ట్రైలర్ లాంచ్ అయింది.
డబ్బు సంతోషాన్నిస్తుంది అనుకున్నా.. డబ్బు సెక్యూరిటీని ఇస్తుందనుకున్నా.. ఒట్టేసుకున్నా.. ఈ పేదరికం నుంచి దూరంగా వెళ్ళిపోవాలని అంటూ.. మంచు విష్ణు వాయిస్ మీద ట్రైలర్ ఓపెన్ అయింది. ‘ప్రతీవాడికీ సిటీ మొత్తం కనిపించేంత పైనుండాలనేదే కోరిక .. మనం పైనున్నప్పుడు ఏం చేస్తామో.. దాన్ని బట్టి.. మనం ఎంత కాలం పైనుంటామో డిసైడ్ అవుతుంది’ అంటూ నవదీప్ డైలాగ్ వినిపిస్తుంది. ఇంతలో కాజల్ పాత్ర ఎంట్రీ .. లక్ష్మీ దేవి ఎందుకంత రిచో తెలుసా? నాలుగు చేతులతో సంపాదిస్తుంది కాబట్టి. అంటూ ఆమె డైలాగ్ చెబుతుంది.
మంచు విష్ణు , నవదీప్, నవీన్ చంద్ర చేతులు కలిపి.. పెద్ద స్కామ్ కు స్కెచ్ వేస్తారు. అమెరికన్స్ కు ఫోన్ చేసి వాళ్ళ టెక్నాలజీని వాడుకుంటూ వాళ్ళనే మోసం చేస్తూ .. డబ్బు మీద డబ్బు సంపాదిస్తూ .. పోలీసుల్ని ముప్పతిప్పలు పెడతారు. డబ్బున్నవాడి దగ్గర డబ్బు కొట్టేయడం తప్పేం కాదన్నది వారి సిద్ధాంతం. అందుకే సుమారు 2,600 కోట్లు కొట్టేస్తారు. ఇక ఈ కేసు ను బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి ఇన్వెస్ట్ గేట్ చేస్తాడు. సిస్టమ్ ను ఒక ఆటాడే వాడే ఇక్కడ కింగ్ అనే అతడ్ని.. పోలీసాఫీసర్ పట్టుకుంటా లేదా? అన్నదే మిగతా కథ.
Must Read ;- సన్ ఆఫ్ ఇండియా కోసం మోహన్ బాబు ప్రయోగం!