‘గంజాయి సాగులో మావోల పాత్ర! .. ఆశ్చర్యం’!! అని లియో ముందుగానే చెప్పింది. మొన్న విశాఖ కేంద్రంగా డీజీపీ గౌతం సవాంగ్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా ఆరు రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశం సాక్షిగా డీజీపీ తన అసహనాన్ని మవోలపై వ్యక్తం చేశారు. గంజాయి సాగు వెనుక ఉంది మావోయిస్టులేనని ప్రకటించారు. మావోలు మాత్రం ఏమైనా తక్కువ తిన్నారా .. ! రివర్స్ పంచ్ గట్టిగానే ఇచ్చారుగా’
మాఫియాకు స్థానిక పోలీసులే కొమ్ముకాస్తున్నారు – మావోలు
ఏపీ డీజీపీ విశాఖ కేంద్రంగా చేసిన కామెంట్ కు మవోలు కూడా రివర్స్ పంచ్ ఇచ్చారు. గంజాయి సాగు, రవాణా, అమ్మకాలల్లో పోలీసుల పాత్రే గణనీయమని ..‘పాడేరు రండి .. గంజాయి సాగును ఏ స్థాయిలో ప్రోత్సహిస్తూ పోలీసు కొమ్ముకాస్తున్నారో సాక్ష్యాలతో సహా బయటపెడుతామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. గంజాయిలో సాగును మావోలు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారం అసత్యమని ఖండించారు.

గంజాయిలో సాగులో పోలీసుల పాత్ర .. ఇవిగో సాక్ష్యాలు!
గంజాయి సాగు, రవాణా, అమ్మకాల్లో పోలీసులే ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని మవోలు ఆరోపిస్తూ విడుదల చేసిన లేఖలో సంచలన విషయాలను బయటపెట్టారు. విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగును ప్రోత్సహిస్తోంది లోకల్ వ్యాపారులు, దళారులు, పోలీసులేనని వెల్లడించారు. గతంలో ముంచుంగిపుట్లు ఎస్ఐ అరుణ్ కుమార్, పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ గంజాయి వ్యాపారం చేస్తూ లక్షలు గడించిన విషయం తెలియదా? అని ప్రశ్నించారు. అదేవిధంగా దుంబ్రిగూడ ఎస్ఐ గంజాయి సాగుచేసిన విషయం అందిరికీ తెలిసిన విషయమేనని గణేష్ గుర్తు చేశారు. అప్పట్లో దుంబ్రిగూడ పోలీసు స్టేషన్ ను ధ్వంసం చేయడానికి కారణాలు కూడా అవేనని వివరిచారు. గంజాయి సాగును ఆరికట్టాలని పోలీసులు పరివర్తపేరుతో గిరిజనులను హింసిస్తున్నారు. అది మంచి పద్దతి కాదన్నారు. అనేక ఏళ్ళుగా గంజాయి సాగుకు ప్రజలను దూరంగా ఉంచాలని గ్రామాల్లో యువకులను చైతన్యపరుస్తూ తాము అనేక కార్యక్రమాలు చేస్తున్నామని లేఖలో వివరించారు. అలా చేస్తున్న మాపై గంజాయి సాగులో మా పాత్ర ఉందని చెప్పడం హాస్యాస్పదమని గణేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు.











