పండుగనాడు కూడా ఎందుకింత వివక్ష ..!
దేశమంతా వెలుగుల పండుగ కన్నుల పండుగగా సాగుతోంది. ప్రజలు సుఖసంతోషాలతో ఆనందంగా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మన రాష్ట్రంలో ప్రస్తుతం పండుగ నాడు కూడా రాజకీయమే నడుస్తోంది. ఒకపక్క రాష్ట్రంలో నిలిచిపోయిన మున్సిపల్, పంచాయితీలకు ఎన్నికలు నిర్వహిస్తూ నామినేషన్లు స్వీకరిస్తున్నారు. మరోపక్క గత రెండు నెలలుగా ఆకాశాన్నంటుతున్న పెట్రోల్,డిజీల్ ధరలను తగ్గించి కేంద్రం ఉమసమనం కల్పిస్తే .. తగ్గించిన ధరలు యథాతథంగా అమలు చేయాడంలో ఏపి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి తీరిక లేకుండా పోయిందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తగ్గించిన వ్యాట్ ను అమలు చేస్తే వచ్చే నష్టమేంటి?
ఆకాశాన్నంటుతున్న పెట్రో, డీజిల్ ధరలను తగ్గిస్తూ .. కేంద్రం ఉపశమన చర్యలో చేపట్టింది. ప్రజలపై దయ తలిచో లేక వచ్చే ఏడాది జరగనున్న కొన్ని రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనేమో కానీ కేంద్రం దిగొచ్చి పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ.10 చొప్పన ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. దీపావళి పండుగ వేళ కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్న వేళా .. ఏపీలో మాత్రం ప్రజలు పక్కరాష్ట్రాలను చూసి ఏడుస్తున్నారు. కేంద్రం నిర్ణయం మేరకు పొరుగు రాష్ట్రాల వారు కేంద్రం బాటలోనే ధరలు తగ్గించిన ఫాలో అవుతుంటే .. ఏపీ ప్రభుత్వం చోద్యం చూస్తుంది. ఈశాన్య రాష్ట్రాల సైతం కేంద్రం తగ్గించిన ధరలను అమలు చేస్తుంటే .. ఏపి ప్రభుత్వం ఎవరెటుపోతే నాకెందుకులే అన్నట్లు .. దున్నపోతుమీద వాన అన్నచందంగా వ్వవహరిస్తోంది.
వ్యాట్ తగ్గింపు విషయంలో ముందు వరసలో ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా ..
కేంద్రం పెట్రోలు, డిజీల్ పై వ్యాట్ ధరలు తగ్గిస్తే .. తగ్గించిన ధరలకు ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలు తాము విధిస్తున్న వ్యాట్ కొంత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఉత్తరప్రదేశ్ పెట్రోలు, డిజీల్ పై రూ.12 రూపాయాల చొప్పున వ్యాట్ ను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు యోగీ. దీంతో పెట్రోలపై రూ. 17, డిజీల్ పై రూ. 22 మేరకు ధరలు తగ్గగా .. యోగీ బాటలోని హర్యానా కూడా ముందకు వచ్చి రాష్ట్ర వ్యాట్ ను రూ.12 కు తగ్గించి, వాహనదారులకు ఉపసమనం కల్పించింది. అలానే అసోం, గోవా, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మణిపూర్ వంటి రాష్ట్రాలు కూడా వ్యాట్లో కోత విధించాయి.










