మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘ఖిలాడి’. ఈ చిత్రానికి రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఖిలాడి’ మూవీకి ప్లే స్మార్ట్ అనేది ట్యాగ్ లైన్. ‘రాక్షసుడు’ సినిమా సక్సస్ తర్వాత రమేష్ వర్మ , క్రాక్ తర్వాత రవితేజ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో.. ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ మూవీ పై పాజిటివ్ బజ్ ఉంది. పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇందులో రవితేజ సరసన మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇటీవల హైదరాబాద్ లో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. న్యూయర్ సందర్భంగా ‘ఖిలాడీ’ చిత్రం నుంచి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఒక రవితేజ మరో రవితేజ తలకు గన్ గురిపెట్టారు. ఈ స్టిల్ ను బట్టి ఖిలాడి మూవీలో రవితేజ డ్యూయర్ రోల్ చేస్తున్నారని తెలిసింది. ఈ పోస్టర్ లో ఒకరు కోపంగా చూస్తుంటే.. మరొకరు భయపడుతూ కనిపిస్తున్నారు.
ఇది మాస్ మహారాజా ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ అని చెప్పచ్చు. ఈ ఒక్క పోస్టర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందస్తున్నారు. ‘క్రాక్’ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తుంటే.. ‘ఖిలాడి’ మూవీ సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. మరి.. ఈ రెండు చిత్రాలతో వరుస విజయాలు సాధించి రవితేజ మళ్లీ ఫామ్ లోకి వస్తారని ఆశిద్దాం.