గోవాలో సామ్ జామ్ జామ్ చేసేస్తోంది. కొత్త ఏడాది సంబరాలను గోవాలో జరుపుకోవాలని సామ్, చైతు నిర్ణయించుకున్నట్టుంది. అందుకే రెండు రోజులు ముందే గోవా వెళ్లిపోయి ఎంచక్కా సంతోష సంబరాలను జరుపుకుంటున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఓ రొమాంటిక్ ఫొటో ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత. తన మజ్నును ముద్దు పెడుతూ ఫొటోకు పోజిచ్చింది ఈ లైలా. ఇదే ఫొటోను నాగ చైతన్య కూడా తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఈ జంటకు రొమాంటిక్ కపూల్ గా నెటిజన్లు పేరు పెట్టేశారు. ఇంతటి రొమాంటిక్ సందడికి లైకులే లైకులు.











