మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్ సంస్థతో కలిసి కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ కీలక పాత్ర పోషిస్తుండడం విశేషం. దీంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఆచార్య ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆచార్య రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది.
Must Read ;- ఆచార్య సెట్ లో షాక్ ఇచ్చిన సోను. ఇంతకీ.. ఏం చేశాడు.?
ఆచార్య రిలీజ్ డేట్ పైనే కాకుండా.. పవర్ స్టార్ వకీల్ సాబ్ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వచ్చేసింది. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న వకీల్ సాబ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు – బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న వకీల్ సాబ్ మూవీ టీజర్ ను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు. ఇక సినిమాని ఏప్రిల్ 9న రిలీజ్ చేయడానికి నిర్ణయించినట్టు సమాచారం.
సరిగ్గా నెల రోజుల తర్వాత అంటే.. మే 9న ఆచార్య సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం చాలా ఫాస్ట్ గా షూటింగ్ చేస్తున్నారు. చరణ్ సంక్రాంతి తర్వాత ‘ఆచార్య’ షూటింగ్ లో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి కానీ.. మార్చి నుంచి ఆచార్య సెట్స్ లో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉందని తెలిసింది. ఏది ఏమైనా.. మే 9న ఆచార్యను రిలీజ్ చేయడం ఫిక్స్ అంటున్నారు. ఈ లెక్కన ఏప్రిల్ 9న తమ్ముడు వకీల్ సాబ్ వస్తే.. కరెక్ట్ గా నెలరోజుల తర్వాత అన్నయ్య ఆచార్య రాబోతున్నాడు. మరి.. అన్నదమ్ములు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read ;- ‘వకీల్ సాబ్’ టీజర్ లో చూపించేది ఇదేనా?