పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా కోసం పవన్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ లో సక్సస్ సాధించిన ‘పింక్’ మూవీకి రీమేక్ కావడంతో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని.. కాకపోతే పవర్ స్టార్ రీ ఎంట్రీ మూవీ కాబట్టి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. అయితే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇంతకీ.. ఆ ఫోటోలు ఎలా బయటకు వచ్చాయి అంటే.. ఈ సినిమాలో క్లైమాక్స్ లో భారీ ఫైట్ ఉంటుందట. ఆ ఫైట్ పవన్ కళ్యాణ్, విలన్ దేవ్ గిల్ మధ్య చిత్రీకరించారు. ఈ ఫోటోలను ఎవరూ లీక్ చేయలేదు.
నటుడు దేవ్ గిల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అంతే.. ‘వకీల్ సాబ్’ అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇందులో పవన్ సరసన శృతిహాసన్ నటించగా, నివేథా థామస్, అంజలి, అనన్య ముఖ్యపాత్రలు పోషించారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. ఏప్రిల్ లో రానున్న ‘వకీల్ సాబ్’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Must Read ;- ‘వకీల్ సాబ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది. !











