పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ వకీల్ సాబ్. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న వకీల్ సాబ్ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నారు కానీ.. సంక్రాంతి కానుకగా జనవరి 14న సాయంత్రం 6.30 నిమిషాలకు వకీల్ సాబ్ టీజర్ రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అఫిషియల్ గా ఎనౌన్స్ చేయడం జరిగింది.
దీంతో వకీల్ సాబ్ టీజర్ రావడం ఖాయం అని తెలిసింది. అయితే.. ఈ టీజర్ లో ఏం చూపించనున్నారు అనేది ఆసక్తిగా మారింది. తాజా సమాచారం ప్రకారం.. మెట్రో ట్రైన్ లో ఫైట్ సీన్ ఉంటుందట. అలాగే.. కోర్టులో కోటు వేసుకుని వాదించగలను.. కోర్టు బయట కోటు తీసి వాయించగలను.. ఇలా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకునేలా డైలాగ్స్ ఉంటాయట. ఇక టీజర్ చివరిలో.. తన సామాను అంతా ఓ వ్యానులో వేసుకుని వెళుతున్న సీన్ ఉంటుందట.
ఈ సినిమాలో మొత్తం మూడు ఫైట్లు ఉంటాయట. పవర్ స్టార్ ఇంట్రడక్షనే ఫైట్ సీన్ తో ఉంటుందని.. ఒక కాలనీలో అందరూ ఇల్లు ఖాళీ చేసేస్తుంటే.. పవన్ కళ్యాణ్ మాత్రం వివేకానందుడి పుస్తకం చదుకుంటుంటాడట. అది చూసి ఓ రౌడీ వివేకానందుడి పుస్తకాన్ని విసిరి పారేస్తాడట. అప్పుడు పవన్ వాడిని కొట్టడంతో.. హీరో ఇంట్రడక్షన్ ఉంటుందని తెలిసింది. ప్రచారంలో ఉన్న ఈ వార్తలను బట్టి వకీల్ సాబ్ టీజర్ పవన్ ఫ్యాన్స్ కి పిచ్చపిచ్చగా నచ్చేలా ఉంటుంది అనిపిస్తుంది. మరి.. టీజర్ యూ ట్యూబ్ లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Must Read ;- పవర్ స్టార్ హరీష్ శంకర్ స్టోరీ పై క్లారిటీ వచ్చేసింది