మెగాస్టార్ చిరంజీవి – బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ చిత్రం ఆచార్య. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నవిషయం తెలిసిందే. అయితే.. ఈ మూవీలో సోను సూద్ ప్రతి నాయకుడుగా నటిస్తున్నాడు. ఇటీవల ఆచార్య షూటింగ్ లో సోను సూద్ జాయిన్ అయ్యారు. చిరంజీవి, సోను సూద్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

ఇదిలా ఉంటే.. ఆచార్య సెట్ లో సోను సూద్ షాక్ ఇచ్చారని తెలిసింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఆచార్య సినిమాకి వర్క్ చేసిన సెట్ బాయ్స్, లైట్ బాయ్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్.. ఇలా వంద మందికి సెల్ ఫోన్ లను బహుమతిగా అందించి తన ధాతృత్వం కొనసాగించారు. దీంతో ఆచార్య టీమ్ చాలా హ్యాఫీగా పీలైందట. సాధారణంగా ఇలాంటి బహుమతులను హీరోలు సినిమా షూటింగ్ చివరి రోజునో.. సక్సస్ అయిన తర్వాతనో అందచేస్తారు.
ఇప్పుడు సోను సూద్ ఇలా తను వర్క్ చేసిన మూవీ టీమ్ కి సెల్ ఫోన్ లు ఇవ్వడం.. అది కూడా వంద మందికి ఇలాంటి గిఫ్ట్ ఇవ్వడం ఎంతైనా అభినందనీయం. వంద మందికి స్వయంగా తన చేతుల మీదుగానే ఈ గిఫ్టు అందచేసారు. ఇలా తన మంచితనంతో ఎందరో మనసులు దోచుకున్న సోను సూద్.. ఇక నుంచి విలన్ గా తెర పై కనిపించడం జరగకపోవచ్చేమో. అందుచేతనంటే.. ఆయనను దృష్టిలో పెట్టుకుని దర్శకులు, రచయితలు హీరోగా కథలు రాసుకుంటున్నారు కానీ.. విలన్ గా సోను సూద్ ని ఎవరూ ఊహించుకోలేకపోతున్నారు. మరి.. సోను హీరోగా ఎంత వరకు రాణిస్తారో చూడాలి.
Must Read ;- రైతుగా రాబోతున్న సోనుసూద్
https://www.youtube.com/watch?v=zMAp4WKY0Mo











